చిత్రం: ఆత్మీయులు(1968)
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల
సంగీతం: సాలూరి.రాజేశ్వర రావు
పల్లవి: మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే చరణం 1: సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూసింది మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే చరణం 2: కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను కెరటాల వెలుగు చెంగలువ నెలరాజు పొందుకోరేను అందాల తారయై మెరిసి చెలికాని చెంత చేరేను మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే చరణం 3: రాధలోని అనురాగమంతా మాధవునిదేలే రాధలోని అనురాగమంతా మాధవునిదేలే వేణులోలుని రాగాల కోసం వేచి ఉన్నదిలే మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే కలనైన కనని ఆనందం ఇలలోన విరిసే ఈనాడే మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి