చిత్రం: సిరి సంపదలు (1962)
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: ఘంటసాల, ,పి. సుశీల
సంగీతం: మాస్టర్ వేణు
*పల్లవి*:
*అతడు*: ఎందుకో సిగ్గెందుకో ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో ఇంతలోనే అమ్మాయికి అంత సిగ్గు ఎందుకో ఎందుకో సిగ్గెందుకో *ఆమె*: పంతాలే తీరెనని తెలిసినందుకే మనసులు కలిసినందుకే... అందుకే సిగ్గందుకే
*చరణం-1*: *అతడు*: చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్లకు వలపు పిలుపు చిన్ననాటి చిలిపి తలపు ఇన్నాళ్లకు వలపు పిలుపు చిరునవ్వుల చిన్నారీ.... ఈ... చిరునవ్వుల చిన్నారి ఇంకా సిగ్గెందుకే ఎందుకో సిగ్గెందుకో
*చరణం-2*:
*ఆమె*: కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై కొనసాగిన కోరికలే మురిపించెను వేడుకలై తనివారగ ఈ వేళా.... ఆ... తనివారగ ఈ వేళ మనసే తూగాడెనే అందుకే సిగ్గందుకే
*చరణం-3*: *అతడు*: నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే
నునుసిగ్గుల తెరచాటున అనురాగం దాగెనులే *ఆమె*: అనురాగం ఆనందం అనురాగం ఆనందం అన్నీ నీ కోసమే *అతడు*: అందుకా? ఆ? సిగ్గందుకా... *ఆమె*:- ఆఁ *అతడు*: పంతాలు తీరెనని తెలిసినందుకా *ఆమె*: మనసులు కలిసినందుకే *అతడు*: (నవ్వుతూ)అందుకా సిగ్గెందుకా *ఆమె*: ఊహు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి