26, జనవరి 2022, బుధవారం

Pelli Kaanuka : Kannulatho Palakarinchu Valapulu Song Lyrics ( కన్నులతో పలుకరించు)

చిత్రం: పెళ్లి కానుక (1960)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఏ.ఎం.రాజా, పి. సుశీల

సంగీతం: ఏ.ఎం.రాజా



 పల్లవి:

    కన్నులతో పలుకరించు వలపులు     ఎన్నటికి మరువరాని తలపులు     కన్నులతో పలుకరించు వలపులు     ఎన్నటికి మరువరాని తలపులు     రెండు ఏకమై ఒహొ ...ప్రేమే లోకమై అహా     నామది పాడే పరాధీనమై ...అలాగా     కన్నులతో పలుకరించు వలపులు     ఎన్నటికి మరువరాని తలపులు చరణం 1:     చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట     చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట     దారులకాచి.. సమయము చూచి ..దాచిన ప్రేమ దోచెనట     మరలా వచ్చెను... మనసే ఇచ్చెను     మరలా వచ్చెను... మనసే ఇచ్చెను     అతనే నీవైతే.. ఆమే నేనట ...నిజంగా ఉం ఉం     కన్నులతో పలుకరించు వలపులు     ఎన్నటికి మరువరాని తలపులు చరణం 2:     నల్లని మేఘం మెల్లగ రాగ ...నాట్యము నెమలి చేసినది     నల్లని మేఘం మెల్లగ రాగ... నాట్యము నెమలి చేసినది     వలచినవాడు సరసకురాగ ఎంతో సిగ్గు వేసినది ...     తనివితీరా తనలో తానే...     తనివితీరా తనలో తానే... మనసే మురిసింది పరవశమొందగా... ఐ సీ     కన్నులతో పలుకరించు వలపులు     ఎన్నటికి మరువరాని తలపులు     రెండు ఏకమై ...ప్రేమే లోకమై ...     నా మది పాడే పరాధీనమై ...     కన్నులతో పలుకరించు వలపులు ...     ఎన్నటికి మరువరాని తలపులు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి