చిత్రం: లవ కుశ (1963)
రచన: సముద్రాల రాఘవాచార్య
గానం: లీల ,పి. సుశీల
సంగీతం: ఘంటసాల
రామ సుగుణధామ రఘువంశ జలధి సోమ... శ్రీరామ సుగుణధామ సీతామనోభి రామ... సాకేత సార్వభౌమ... శ్రీరామ సుగుణధామా... మందస్మిత సుందర వదనారవింద రామా... ఇందీవర శ్యామలాంగా వందితసుత్రామ... మందార మరందోపమ మధుర మధుర నామా... మందార మరందోపమ మధుర మధుర నామా... శ్రీరామ సుగుణధామ... రఘువంశజలధి సోమా... శ్రీరామ సుగుణధామ... అవతార పురుష రావణాది దైత్య విరామ... నవనీత హృదయ ధర్మ నిరతరాజల రామ... పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ... పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ... శ్రీరామ సుగుణధామ... రఘువంశజలధి సోమ... సీతామనోభిరామా... సాకేత సార్వభౌమా... సీతామనోభి రామా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి