LavaKusa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
LavaKusa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జనవరి 2022, శుక్రవారం

Lava Kusa : Jagadabhi Ramudu Sriraamude Song Lyrics (జగదభిరాముడు శ్రీరాముడే)

చిత్రం: లవ కుశ (1963)

రచన: సముద్రాల రాఘవాచార్య

గానం: లీల ,పి. సుశీల

సంగీతం: ఘంటసాల



జయ జయరామ్ జయ రఘురామ్ జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆ రాముడే జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆ రాముడే జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆ రాముడే

జనకుని మాటల తలపై నిలిపీ తన సుఖముల విడి వనితామణితో వనముల కేగిన ధర్మావతారుడు

జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆ రాముడే కరమున ధనువు శరములు దాలిచి కరమున ధనువు శరములు దాలిచి కరమున ధనువు శరములు దాలిచి ఇరువది చేతులు దొరనే కూలిచి సురలను గాచిన వీరాధి వీరుడు జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆ రాముడే

ఆలూ మగలా అనురాగాలకు ఆలూ మగలా అనురాగాలకు పోలిక సీతారాములె యనగా పోలిక సీతారాములె యనగా వెలసిన ఆదర్శ ప్రేమావతారుడు 

జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆ రాముడే నిరతము ధర్మము నెరపీ నిలిపీ నిరతము ధర్మము నెరపీ నిలిపీ నరులకు సురులకు తరతరాలకూ ఒరవడియైన వర యుగపురుషుడు 

జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆ రాముడే ఇనకుల మణి సరితూగే తనయుడు అన్నయు ప్రభువు లేనేలేడని ఇనకుల మణి సరితూగే తనయుడు అన్నయు ప్రభువు లేనేలేడని జనులు భజించే పురుషోత్తముడు జగదభిరాముడు శ్రీరాముడే రఘుకుల సోముడు ఆ రాముడే జయ జయరామ్ జయ రఘురామ్ జయ జయరామ్ జయ రఘురామ్ జయ జయరామ్ జయ రఘురామ్

Lava Kusa : Ye Nimishaniki Yemi Jaruguno Song Lyrics (ఏ నిమిషానికి ఏమి జరుగునో)

చిత్రం: లవ కుశ (1963)

రచన: కొసరాజు

గానం: ఘంటసాల

సంగీతం: ఘంటసాల




ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఓ...ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు కంచె యతితముగా చేను మేసినా కాదను వారెవరు రాజే ఇది శాసనమని పల్కినా ప్రతిఘటించు వారెవరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు కరునామయురిది కాదనలేరా కఠిన కార్యమనబోరా సాథ్వులకెపుడు వెతలేనా తీరని ధుఃఖపు కథలేనా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఇనకులమున జనియించిన నృపధులు ఈ దారుణము సహించెదరా వినువీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఎండకన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకో ఈ వనవాసాలు తరచి చూచినా బోధపడవులే దైవ చిద్విలాసాలు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అగ్నిపరీక్షకే నిల్చిన సాథ్విని అనుమానించుట న్యాయమా అల్పుని మాటయే జనవాక్యమ్మని అల్పుని మాటయే జనవాక్యమ్మని అనుసరించుటే ధర్మమా ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఎవరూహించెదరు

Lava Kusa : Srirama Sugunadhama Jayarama Parandhama Song Lyrics (రామ సుగుణధామ)

చిత్రం: లవ కుశ (1963)

రచన: సముద్రాల రాఘవాచార్య

గానం: లీల ,పి. సుశీల

సంగీతం: ఘంటసాల



రామ సుగుణధామ రఘువంశ జలధి సోమ... శ్రీరామ సుగుణధామ సీతామనోభి రామ... సాకేత సార్వభౌమ... శ్రీరామ సుగుణధామా... మందస్మిత సుందర వదనారవింద రామా... ఇందీవర శ్యామలాంగా వందితసుత్రామ... మందార మరందోపమ మధుర మధుర నామా... మందార మరందోపమ మధుర మధుర నామా... శ్రీరామ సుగుణధామ... రఘువంశజలధి సోమా... శ్రీరామ సుగుణధామ... అవతార పురుష రావణాది దైత్య విరామ... నవనీత హృదయ ధర్మ నిరతరాజల రామ... పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ... పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ... శ్రీరామ సుగుణధామ... రఘువంశజలధి సోమ... సీతామనోభిరామా... సాకేత సార్వభౌమా... సీతామనోభి రామా..

Lava Kusa : Ramakathanu Vinarayyaa Song Lyrics (రామకథను వినరయ్యా)

చిత్రం: లవ కుశ (1963)

రచన: సముద్రాల రాఘవాచార్య

గానం: లీల ,పి. సుశీల

సంగీతం: ఘంటసాల



రామకథను వినరయ్యా రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజులు రాణులు మువ్వురు కౌసల్య సుమిత్ర కైకేయి నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ..ఆ..ఆ..ఆ..ఆ రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా ఘడియ ఏమి రఘురాముని విడచి గడుపలేని ఆ పూజని కౌశిక యాగము కాచి రమ్మని కౌశిక యాగము కాచి రమ్మని పలికెను నీరదశ్యాముని రామకథను వినరయ్యా తాటకి దునిమి జన్నము గాచి తపసుల దీవన తలదాల్చి జనకుని యాగము చూచు నెపమ్మున జనకుని యాగము చూచు నెపమ్మున చనియెను మిథిలకు దాశరథి రామకథను వినరయ్యా మదనకోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది ధరణిజ మదిలో మెరసిన మోదము ఆ..ఆ..ఆ..ఆ..ఆ కన్నుల వెన్నెల వీచినది రామకథను వినరయ్యా హరుని విల్లు రఘునాథుడు చేగొని ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది కళకళలాడే సీతారాముల ఆ..ఆ..ఆ..ఆ..ఆ కళకళలాడే సీతారాముల ఆ..ఆ..ఆ..ఆ..ఆ కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిపినవి రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా


20, ఆగస్టు 2021, శుక్రవారం

Lava Kusa : Sriraamuni Charitamunu Telipedamamma Song Lyrics (శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా…)

చిత్రం: లవకుశ (1963)

సంగీతం: ఘంటసాల

సాహిత్యం: సముద్రాల రాఘవాచార్య

గానం: పి.సుశీలపి.లీల



హో...............

శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా… శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా… చెలువు మీరా పంచవటి సీమలో.. తమ కొలువు చేయ సౌమిత్రి ప్రేమతో.. తన కొలువు తీరే రాఘవుడు భామతో… శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా… రాముగని ప్రేమగోనే రావను చెల్లి… ముకుచెవులు కోసే సౌమి ప్రియరాచెలి.. రావనుడా మాట విని పంతము పూని.. మైథిలిని కొనిపోయే మాయలు పన్ని.. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా… రఘుపతిని రవిసుతుని కలిపెను హనుమ… నృపుజేసెను సుగ్రీవుని రామవచన మహిమ ప్రతి ఉపకృతి చేయుమని పలికెను కపుల.. హనుమంతుడు లంక జేరి వెదకెను నలుదిశలా శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా… ఆ.. నాథా.. రఘునాథా.. పాహి పాహి పాహి అని అశొకవనిని సోకించే సీత.. పాహి అని అశొకవనిని సోకించే సీత.. దరికజనీ ముద్రికనిది తెలిపె విభునివార్తా… ఆ జనని శిరోమణి అందుకొని పావని… ఆ జనని శిరోమణి అందుకొని పావని… లంక కాల్చి రాముని కడకేగెను రివురివ్వుమని… శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా… ------------- దశరథ సోనుడు లంకను దాసీ… దశకంటు తలలు కోసి… దశరథ సోనుడు లంకను దాసీ… దశకంటు తలలు కోసి… ఆతని తమ్ముని రాజును చేసి సీతను తెమ్మని పలికే… చేరవచ్చు ఇల్లాలిని చూసి... శీల పరిక్షను కోరే రఘుపతి… అయోనిజపైనే అనుమానమా… ధర్మమూర్తి రామచంద్రుని ఇల్లాలిగా ఈ పరీక్షా… పతి ఆనతి తలదాలికి అగ్ని దూకే సీత... పతి ఆనతి తలదాలికి అగ్ని దూకే సీత... కుతవాహుడు చల్లబడి సాగించెను మాత కుతవాహుడు చల్లబడి సాగించెను మాత సురలు పొగడ ధరనిజతో పురిక తరలే రఘునేత.... శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా… ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా… ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మా… వినుడోయమ్మా... వినుడోయమ్మా... శ్రీరాఘవం.. దశరథాత్మజ మప్రయేయమ్.. సీతాపతిం... రఘుకులాన్ముయ రత్నదీపం... ఆజానుబాహుం... అరవింద దళాయతాక్షం... రామం నిశాచర వినాశకరమ్ నమామి... రామ సుగుణధామ రఘువంశ జలధి సోమ... శ్రీరామ సుగునధామ సీతామనోభి రామ... సాకేత సార్వభౌమ... శ్రీరామ సుగుణధామా... మందస్మిత సుందర వదనారవింద రామా... ఇందీవర శ్యామలాంగా వందితసుత్రామ... మందార మరందోపమ మధుర మధుర నామా... మందార మరందోపమ మధుర మధుర నామా... శ్రీరామ సుగుణధామ... రఘువంశజలధి సొమా... శ్రీరామ సుగుణధామ...

అవతార పురుష రావనాది దైత్య విరామ... నవనీత హృదయ ధర్మ నిరతరాజల రామ... పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ... పవమానతనయ సన్నుత పరమాత్మ పరంధామ... శ్రీరామ సుగుణధామ... రఘువంశజలధి సోమ... సీతామనోభిరామా... సాకేత సార్వభౌమా... సీతామనోభి రామా..