14, జనవరి 2022, శుక్రవారం

Lava Kusa : Ramakathanu Vinarayyaa Song Lyrics (రామకథను వినరయ్యా)

చిత్రం: లవ కుశ (1963)

రచన: సముద్రాల రాఘవాచార్య

గానం: లీల ,పి. సుశీల

సంగీతం: ఘంటసాల



రామకథను వినరయ్యా రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజులు రాణులు మువ్వురు కౌసల్య సుమిత్ర కైకేయి నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ..ఆ..ఆ..ఆ..ఆ రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా ఘడియ ఏమి రఘురాముని విడచి గడుపలేని ఆ పూజని కౌశిక యాగము కాచి రమ్మని కౌశిక యాగము కాచి రమ్మని పలికెను నీరదశ్యాముని రామకథను వినరయ్యా తాటకి దునిమి జన్నము గాచి తపసుల దీవన తలదాల్చి జనకుని యాగము చూచు నెపమ్మున జనకుని యాగము చూచు నెపమ్మున చనియెను మిథిలకు దాశరథి రామకథను వినరయ్యా మదనకోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది ధరణిజ మదిలో మెరసిన మోదము ఆ..ఆ..ఆ..ఆ..ఆ కన్నుల వెన్నెల వీచినది రామకథను వినరయ్యా హరుని విల్లు రఘునాథుడు చేగొని ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది కళకళలాడే సీతారాముల ఆ..ఆ..ఆ..ఆ..ఆ కళకళలాడే సీతారాముల ఆ..ఆ..ఆ..ఆ..ఆ కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిపినవి రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి