28, జనవరి 2022, శుక్రవారం

Letha Manasulu : Pillalu Devudu Challani Vare Song Lyrics (పిల్లలు దేవుడు చల్లనివారే)

చిత్రం: లేత మనసులు (1966)
సాహిత్యం: దాశరథి
గానం: పి. సుశీల
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాథన్




పల్లవి : పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం తప్పులు మన్నించుటే దేవుని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే చరణం : 1 పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును ఆ పురుటికందు మనసులో దైవముండును ఆ పురుటికందు మనసులో దైవముండును వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే వయసు పెరిగి ఈసు కలిగి మదము హెచ్చితే అంత మనిషిలో దేవుడే మాయమగునులే అంత మనిషిలో దేవుడే మాయమగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే చరణం : 2 వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బు మూయును మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును మనిషి తెలివియనే సూర్యుణ్ణి కోపం మూయును గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే గాలి వీచ మబ్బు తెరలు కదలిపోవులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే చరణం : 3 పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు పెరిగి పెరిగి పిల్లలే పెద్దలౌదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు మాయమర్మమేమి లేని బాలలందరు మాయమర్మమేమి లేని బాలలందరు ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే పిల్లలు దేవుడు చల్లని వారే కల్లకపటమెరుగని కరుణామయులే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి