చిత్రం: భక్త తుకారాం (1973)
సాహిత్యం: దాశరధి
గానం: ఘంటసాల
సంగీతం: పి. ఆదినారాయణ రావు
ఉన్నావా… అసలున్నావా ఉంటే కళ్ళుమూసుకున్నావా… ఈ లోకం కుళ్ళు చూడకున్నవా ఉన్నావా… అసలున్నావా ఉంటే కళ్ళుమూసుకున్నావా… ఈ లోకం కుళ్ళు చూడకున్నవా ఉన్నావని కనుగొన్నామని మున్నెందరెందరో అన్నారు ఉన్నావని చూస్తున్నావని నమ్మి ఎందరో ఉన్నారు ఉన్నావా… అసలున్నావా నీ పేరిట వంచన పెరుగుతువుంటే… నీ ఎదుటే హింసలు జరుగుతు వుంటే మనిషిని మనిషి దోస్తూవుంటే… మంచికి సమాధి కడుతూ వుంటే రాతి బొమ్మవై నిలిచావు.. చాతగాని వాడనిపించావు ఉన్నావా… అసలున్నావా నీ భక్తుడ నయ్యాను.. నిత్య దరిద్రుడనయ్యాను నీ భక్తుడ నయ్యాను.. నిత్య దరిద్రుడనయ్యాను సేవలు చేశాను.. నా బ్రతుకే నైవేద్యం చేశాను చేసిన మేలునుమరిచేవాడా.. నువ్వా దేవుడివి.. నువ్వొక వ్యర్థుడివి నీకొక పేరూ లేదు.. రూపం లేదు .. నీతి లేదు.. నియమం లేదు.. నిజానికి నువ్వే లేవు.. లేవు.. లేవు.. లేవు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి