22, జనవరి 2022, శనివారం

Manchi Chedu : Repanti Roopam Kanti Song Lyrics (రేపంటి రూపం కంటి)

చిత్రం : మంచి చెడు (1963)
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల,,పి. సుశీల
సంగీతం : విశ్వనాథన్–రామమూర్తి




రేపంటి రూపం కంటి పూవింటి తూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కళలు కలలు నీ సొమ్మంటి నా తోడూ నీవైవుంటే నీ నీడ నేనేనంటి ఈ జంట కంటే వేరే లేదు లేదంటి నా తోడూ నీవైవుంటే నీ నీడ నేనేనంటి ఈ జంట కంటే వేరే లేదు లేదంటి నీ పైన ఆశలు వుంచి ఆ పైన కోటలు పెంచి నీ పైన ఆశలు వుంచి ఆ పైన కోటలు పెంచి నీ కోసం రేపు మాపు ఉంటిని నిన్నంటి రేపంటి రూపం కంటి పూవింటి తూపులవంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి నే మల్లెపువ్వై విరిసి నీ నల్లని జడలో వెలిసి నీ చల్లని నవ్వుల కలసి ఉంటే చాలంటి నే మల్లెపువ్వై విరిసి నీ నల్లని జడలో వెలిసి నీ చల్లని నవ్వుల కలసి ఉంటే చాలంటి నీ కాలి మువ్వల రవళి నా భావి మోహన మురళి నీ కాలి మువ్వల రవళి నా భావి మోహన మురళి ఈ రాగ తరలి తరలి పోదాం రమ్మంటి రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కళలు కలలు నీ సొమ్మంటి నీలోని మగసిరి తోటి నాలోని సొగసుల పోటి వేయించి నేనే ఓడీ పోనీ పొమ్మంటి నే నోడీ నీవే గెలిచి నీ గెలుపు నాదని తలచి రాగాలు రంజిలు రోజే రాజీ రమ్మంటి రేపంటి వెలుగే కంటి పూవింటి దొరనే కంటి నా కంటి కళలు కలలు నీ సొమ్మంటి రేపంటి రూపం కంటి పూవింటి తూపుల వంటి నీ కంటి చూపుల వెంట నా పరుగంటి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి