చిత్రం : శ్రీ వే౦కటేశ్వర మహత్య౦ (1960)
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల
సంగీతం : పెండ్యాల
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. మురిపించి లాలించి..మూచ్చటల తేల్చి.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. పట్టు పానుపుపైన పవళించర స్వామి.. పట్టు పానుపుపైన పవళించర స్వామి.. భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ.. చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. కరువుదీర కాంచి తరియించుమూ మేము. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా.. శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి