18, జనవరి 2022, మంగళవారం

Missamma : Avunante Kaadanile Song Lyrics (అవునంటే కాదనిలే)

చిత్రం: మిస్సమ్మ(1955 )

సాహిత్యం: పింగళి నాగేంద్ర రావు

గానం: ఏ.ఎం.రాజా

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు



అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్దాలే వేరులే అర్దాలే వేరులే అర్దాలే వేరులే అలిగి తొలగి నిలిచినచో అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలే చొరవ చేసి రమ్మనుచో చొరవ చేసి రమ్మనుచో మరియాదగా పొమ్మనిలే ఆడువారి మాటలకు అర్దాలే వేరులే అర్దాలే వేరులే అర్దాలే వేరులే విసిగి నసిగి కసిరినచో విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములే తరచి తరచి ఊసడిగిన తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే ఆడువారి మాటలకు అర్దాలే వేరులే అర్దాలే వేరులే అర్దాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్దాలే వేరులే అర్దాలే వేరులే అర్దాలే వేరులే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి