చిత్రం : పెళ్లి కానుక (1960)
సంగీతం : ఏ.ఎం. రాజా రచన : ఆచార్య ఆత్రేయ గానం : జిక్కిపులకించని మది పులకించు... వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు... మనసునే మరపించు గానం
పులకించని మది పులకించు... వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల వించు... మనసునే మరపించు గానం
మనసునే మరపించు..
చరణం : 1
రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం
రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం
చెదరిపోయే భావములను చేర్చికూర్చును గానం
జీవమొసగును గానం మది చింతబాపును గానం
చరణం : 2
వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
కూలిపోయిన తీగలైనా కొమ్మనలికి ప్రాకును
కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన మదిలో
దోరవలపే కురియు... మదీ దోచుకొనుమని పిలుచు
పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు
అనిపించని ఆశల నించు మనసునే మరపించు
ప్రేమా... మనసునే మరపించు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి