Pelli Kaanuka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pelli Kaanuka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, మార్చి 2022, శుక్రవారం

Pelli Kaanuka : Paaduta Marachedavaela Song Lyrics ( వాడుక మరచెదవేల)

చిత్రం: పెళ్లి కానుక (1960)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఏ.ఎం.రాజా, పి. సుశీల

సంగీతం: ఏ.ఎం.రాజా



పల్లవి :  వాడుక మరచెదవేల  నను వేడుక చేసెదవేల  నిను చూడని దినము నాకొక యుగము  నీకు తెలుసును నిజము... (2)  వాడుక మరువను నేను  నిను వేడుక చేయగలేను  నిను చూడని క్షణము నాకొక దినము  నీకు తెలుసును నిజము... (2)  చరణం : 1  సంజరంగుల చల్లని గాలుల  మధుర రాగము మంజుల గానము  ॥సంజరంగుల॥  తేనె విందుల తీయని కలలూ మరిచిపోయిన వేళ  ఇక మనకీ మనుగడ ఏల  నీ అందము చూపి డెందము ఊపి  ఆశ రేపెదవేలా ఆశ రేపెదవేలా  ఓ ఓ ఓ... సంజరంగుల సాగినా చల్లగాలులు ఆగినా  ॥సంజరంగుల॥  కలసి మెలసిన కన్నులలోన... (2)  మనసు చూడగలేవా...  మరులు తోడగలేవా...  ॥వాడుక మరువను॥  చరణం : 2  కన్నులా ఇవి కలల వెన్నెలా  చిన్నె వన్నెల చిలిపి తెన్నులా  ॥కన్నులా॥  మనసు తెలిసీ మర్మమేలా  ఇంత తొందర ఏలా  ఇటు పంతాలాడుట మేలా  నాకందరికన్నా ఆశలు ఉన్నా  హద్దు కాదనగలనా హద్దు కాదనగలనా  వాడని నవ్వులతోడ  నడయాడెడు పువ్వుల జాడ  అనురాగము విరిసి లోకము మరచి  ఏకమౌదము కలసి ఏకమౌదము కలసి






26, జనవరి 2022, బుధవారం

Pelli Kaanuka : Kannulatho Palakarinchu Valapulu Song Lyrics ( కన్నులతో పలుకరించు)

చిత్రం: పెళ్లి కానుక (1960)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఏ.ఎం.రాజా, పి. సుశీల

సంగీతం: ఏ.ఎం.రాజా



 పల్లవి:

    కన్నులతో పలుకరించు వలపులు     ఎన్నటికి మరువరాని తలపులు     కన్నులతో పలుకరించు వలపులు     ఎన్నటికి మరువరాని తలపులు     రెండు ఏకమై ఒహొ ...ప్రేమే లోకమై అహా     నామది పాడే పరాధీనమై ...అలాగా     కన్నులతో పలుకరించు వలపులు     ఎన్నటికి మరువరాని తలపులు చరణం 1:     చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట     చల్లని వేళ మల్లెల నీడ చక్కని దొంగ దాగెనట     దారులకాచి.. సమయము చూచి ..దాచిన ప్రేమ దోచెనట     మరలా వచ్చెను... మనసే ఇచ్చెను     మరలా వచ్చెను... మనసే ఇచ్చెను     అతనే నీవైతే.. ఆమే నేనట ...నిజంగా ఉం ఉం     కన్నులతో పలుకరించు వలపులు     ఎన్నటికి మరువరాని తలపులు చరణం 2:     నల్లని మేఘం మెల్లగ రాగ ...నాట్యము నెమలి చేసినది     నల్లని మేఘం మెల్లగ రాగ... నాట్యము నెమలి చేసినది     వలచినవాడు సరసకురాగ ఎంతో సిగ్గు వేసినది ...     తనివితీరా తనలో తానే...     తనివితీరా తనలో తానే... మనసే మురిసింది పరవశమొందగా... ఐ సీ     కన్నులతో పలుకరించు వలపులు     ఎన్నటికి మరువరాని తలపులు     రెండు ఏకమై ...ప్రేమే లోకమై ...     నా మది పాడే పరాధీనమై ...     కన్నులతో పలుకరించు వలపులు ...     ఎన్నటికి మరువరాని తలపులు..

21, జనవరి 2022, శుక్రవారం

Pelli Kaanuka : Pulakinnchani Madi Pulakinchu Song Lyrics (పులకించని మది పులకించు)

చిత్రం :  పెళ్లి కానుక (1960)

సంగీతం :  ఏ.ఎం. రాజా రచన :  ఆచార్య ఆత్రేయ గానం :  జిక్కి


పులకించని మది పులకించు... వినిపించని కథ వినిపించు అనిపించని ఆశల వించు... మనసునే మరపించు గానం పులకించని మది పులకించు... వినిపించని కథ వినిపించు అనిపించని ఆశల వించు... మనసునే మరపించు గానం మనసునే మరపించు.. చరణం : 1 రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం రాగమందనురాగ మొలికి రక్తి నొసగును గానం రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం చెదరిపోయే భావములను చేర్చికూర్చును గానం జీవమొసగును గానం మది చింతబాపును గానం చరణం : 2 వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును కూలిపోయిన తీగలైనా కొమ్మనలికి ప్రాకును కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన మదిలో దోరవలపే కురియు... మదీ దోచుకొనుమని పిలుచు పులకించని మది పులకించు వినిపించని కథ వినిపించు అనిపించని ఆశల నించు మనసునే మరపించు ప్రేమా... మనసునే మరపించు