చిత్రం: ప్రేమ నగర్(1971)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల,పి. సుశీల
సంగీతం: కె. వి. మహదేవన్
నీ ...కోసం... ఆ.ఆ.ఆ.ఆ... నీ ...కోసం ...ఆ.ఆ.ఆ.ఆ... నీ కోసం వెలిసిందీ... ప్రేమ మందిరం నీ కోసం విరిసిందీ హృదయనందనం ||2|| నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం. ప్రతి పువ్వూ నీ నవ్వే నేర్చుకున్నదీ. ప్రతి తీగ నీ ఒంపులు తెచ్చుకున్నదీ. ప్రతి పాదున నీ మమతే పండుతున్నదీ. ప్రతి పందిరి నీ మగసిరి చాటుతున్నదీ. నీ కోసం విరిసిందీ... హృదయ నందనం... నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం... ఆ...ఆ... ఆ... అలుపు రాని వలపులు... ఆహహహా ఆడుకునేదిక్కడ... ఆ అ అ ఆ చెప్పలేని తలపులు ...అహహహా... చేతలయేదిక్కడ... ఆఆ ...ఆఆఅ విడిపోని బంధాలు వేసుకునేదిక్కడ తొలి చెలిమీ అనుభవాలు, తుది చూసేదిక్కడ. ఆ ఆఆఅ... ...ఓ ఒఒఒ.ఓ... ...ఆహహహాహ ...ఆఆఆ. నీ కోసం వెలిసిందీ ప్రేమ మందిరం. కలలెరుగని మనసుకు అహహహా... కన్నెరికం చేశావు. ఆఆ... శిలవంటి మనిషిని. అహహహా. శిల్పంగా మార్చావు ఆఆఅ. తెరువని నా గుడి తెరిచీ... దేవివై వెలిశావు. నువు మలచిన ఈ బ్రతుకూ, నీకే నైవేద్యం... ఆఆఆఆఅ.ఆఆఆ అ ఓఒఓఒ.ఒ. ఒ ఒ అహహహహాహ... ఆ. అ అ అ అ ఆ ... నీకోసం వెలిసిందీ, ప్రేమ మందిరం. నీ కోసం... విరిసిందీ... హృదయ నందనం... నీ కోసం వెలిసిందీ... ప్రేమ మందిరం. నీ ...కోసం... నీ ...కోసం...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి