చిత్రం: వేటగాడు
సంగీతం:కే చక్రవర్తి
సాహిత్యం: వేటూరి
గానం: S.P.బాలసుబ్రహ్మణ్యం , P.సుశీల
ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకు చాటు పిందె తడిసే కొమ్మ చాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది ముద్దిచ్చీ ఓ చినుకు ముత్యమైపోతుంటే అహ అహ అహ అహ చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే అహ అహ అహ అహ ఓ చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే ఓ చినుకు నిను తాకి తడి ఆరిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగ నవ్వుతుంటే!! నీ మాట విని మబ్బు మెరిసే అహా... జడి వానలే కురిసీ కురిసీ వళ్ళు తడిసీ వెల్లీ విరిసీ చిలిపి చినుకుల్లో తల దాచుకోవాలి అహ అహ అహ అహ అహ అహ ఆకు చాటు పిందె తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది మై మరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే అహ అహ అహ అహ ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే అహ అహ అహ అహ ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే అహా నీ పాట విని మెరుపులోచ్చీ అహా నీ విరిపూలే ముడుపులిచ్చీ చలిని పెంచీ చెలిమి పంచీ తలలు వెచ్చంగా తడి ఆర్చుకోవాలి అహ అహ అహ అహ అహ అహ ఆకు చాటు పిందె తడిసే అహ అహ అహ అహ కొమ్మచాటు పువ్వు తడిసే అహ అహ అహ అహ ఆకు చాటు పిందె తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెట్టింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి