16, జనవరి 2022, ఆదివారం

Prema Nagar : Theta Theta Telugula Song Lyrics (తేట తేట తెలుగులా)

చిత్రం: ప్రేమ నగర్(1971)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల

సంగీతం: కె. వి. మహదేవన్




తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా _ సెలయేరులా కలకలా _ గలగలా కదిలి వచ్చింది _ కన్నె అప్సర వచ్చి నిలిచింది _ కనుల ముందర... తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా _ సెలయేరులా కలకలా _ గలగలా కదిలి వచ్చింది _ కన్నె అప్సర వచ్చి నిలిచింది _ కనుల ముందర... తెలుగు వారి ఆడ పడుచు ఎంకిలా _ ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా తెలుగు వారి ఆడ పడుచు ఎంకిలా _ ఎంకి కొప్పులోని ముద్దబంతి పువ్వులా గోదారి కెరటాల గీతాల వలె నాలో పలికినది _ పలికినది _ పలికినది... చల్లగా _ చిరుజల్లుగా జలజలా గలగలా.... కదిలి వచ్చింది _ కన్నె అప్సర వచ్చి నిలిచింది _ కనుల ముందర... తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా రెక్కలొచ్చి వూహలన్ని ఎగురుతున్నవి ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి రెక్కలొచ్చి వూహలన్ని ఎగురుతున్నవి ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి లో లోన నా లోన ఎన్నెన్నో రూపాలు వెలిసినవి...వెలిసినవి... వెలిసినవి... వీణలా _ నెరజాణలా... కలకలా _ గల గలా.. కదిలి వచ్చింది _ కన్నె అప్సర వచ్చి నిలిచింది _ కనుల ముందర... తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి