చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
అతడు: కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూటొక్క టెంకాయ కొడతానని ఆమె: కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా
కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పడిచస్తే నూటొక్క టెంకాయ కొడతానని॥ అ: హలో... ఆ: హలో...
హలో... ఆ: హలో... అ: హలో హలో అనమంటుంది కుర్రమనసు ఆ: చలో చలో పొమ్మంటుంది బుల్లిమనసు అ: పొమ్మని పైపైకి అంటుంది రమ్మని లోలోన ఉంటుంది ॥ ఆ: పొమ్మని రమ్మంటే అది స్వర్గం రమ్మని పొమ్మంటే అది నరకం ఆ స్వర్గంలోనే తేలిపోవాలి ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి ఔనంటే నువ్వు ఊ... అంటే
ఔనంటే నువ్వు ఊ... అంటే నూటొక్క టెంకాయ కొడతానని॥ అ: గొంతు గొంతు కలిపి పాడితే యుగళ గీతం ఆ: పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయగీతం కళ్లు కలుసుకుంటే ప్రేమపాఠము కళ్లు కుట్టుకుంటే గుణపాఠము ఆ: కళ్లు కళ్లు కలిపి చూడు ఒక్కసారి ఒళ్లు ఝల్లుమంటుంది తొలిసారి అ: ఆ జల్లుల్లోనే తడిసిపోవాలి ఆ తడి కౌగిల్లో అలిసిపోవాలి॥॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి