చిత్రం: ప్రేమాభిషేకం (1981)
సాహిత్యం: దాసరి నారాయణ రావు
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: చక్రవర్తి
పల్లవి : తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి
ఒక పాట పాడాలి ॥ చరణం : 1 ఊరంతా ఆకాశాన గోరంత దివ్వెగా పిడికెడంత గుండెలోన కొండంత వెలుగుగా కనిపించే రంగులన్నీ సిందూరపు చీరగా కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా ॥ నిలిచి పొమ్మనీ మబ్బుగా కురిసి పొమ్మనీ వానగా విరిసి పొమ్మనీ వెన్నెలగా మిగిలి పొమ్మనీ నా గుండెగా
మిగిలి పొమ్మనీ నా గుండెగా ॥॥ చరణం : 2 నీలిరంగు చీకటిలో నీలాల తారగా చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా వేటాడే చూపులన్నీ లోలోని ప్రేమగా వెంటాడే వలపులన్నీ కాబోయే పెళ్లిగా ॥ చెప్పి పొమ్మనీ మాటగా చేసి పొమ్మనీ బాసగా చూపి పొమ్మనీ బాటగా ఇచ్చి పొమ్మనీ ముద్దుగా
ఇచ్చి పొమ్మనీ ముద్దుగా ॥॥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి