Premabhishekam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Premabhishekam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

16, జనవరి 2022, ఆదివారం

Premabhishekam : Kotapa Kondaku Song Lyrics ( కోటప్పకొండకు)

చిత్రం: ప్రేమాభిషేకం (1981)

సాహిత్యం: దాసరి నారాయణ రావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



అతడు: కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో కన్నెపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే నూటొక్క టెంకాయ కొడతానని ఆమె: కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా

కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబయట ఎండలో సరుగుతోట నీడలో బుజ్జిబాబు కనిపిస్తే నా కోసం పడిచస్తే నూటొక్క టెంకాయ కొడతానని॥ అ: హలో... ఆ: హలో...

హలో... ఆ: హలో... అ: హలో హలో అనమంటుంది కుర్రమనసు ఆ: చలో చలో పొమ్మంటుంది బుల్లిమనసు అ: పొమ్మని పైపైకి అంటుంది రమ్మని లోలోన ఉంటుంది ॥ ఆ: పొమ్మని రమ్మంటే అది స్వర్గం రమ్మని పొమ్మంటే అది నరకం ఆ స్వర్గంలోనే తేలిపోవాలి ఈ స్వప్నంలోనే నలిగిపోవాలి ఔనంటే నువ్వు ఊ... అంటే

ఔనంటే నువ్వు ఊ... అంటే నూటొక్క టెంకాయ కొడతానని॥ అ: గొంతు గొంతు కలిపి పాడితే యుగళ గీతం ఆ: పెదవి పెదవి కలిపి పాడితే ప్రణయగీతం కళ్లు కలుసుకుంటే ప్రేమపాఠము కళ్లు కుట్టుకుంటే గుణపాఠము ఆ: కళ్లు కళ్లు కలిపి చూడు ఒక్కసారి ఒళ్లు ఝల్లుమంటుంది తొలిసారి అ: ఆ జల్లుల్లోనే తడిసిపోవాలి ఆ తడి కౌగిల్లో అలిసిపోవాలి॥॥

Premabhishekam : Taralu Digi Vachhina Vela Song Lyrics (తారలు దిగి వచ్చిన వేళ)

చిత్రం: ప్రేమాభిషేకం (1981)

సాహిత్యం: దాసరి నారాయణ రావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: చక్రవర్తి



పల్లవి : తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి

ఒక పాట పాడాలి చరణం : 1 ఊరంతా ఆకాశాన గోరంత దివ్వెగా పిడికెడంత గుండెలోన కొండంత వెలుగుగా కనిపించే రంగులన్నీ సిందూరపు చీరగా కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా నిలిచి పొమ్మనీ మబ్బుగా కురిసి పొమ్మనీ వానగా విరిసి పొమ్మనీ వెన్నెలగా మిగిలి పొమ్మనీ నా గుండెగా

మిగిలి పొమ్మనీ నా గుండెగా ॥॥ చరణం : 2 నీలిరంగు చీకటిలో నీలాల తారగా చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా వేటాడే చూపులన్నీ లోలోని ప్రేమగా వెంటాడే వలపులన్నీ కాబోయే పెళ్లిగా చెప్పి పొమ్మనీ మాటగా చేసి పొమ్మనీ బాసగా చూపి పొమ్మనీ బాటగా ఇచ్చి పొమ్మనీ ముద్దుగా

ఇచ్చి పొమ్మనీ ముద్దుగా ॥॥

Premabhishekam : Oka Devuni Gudilo Song Lyrics (ఒక దేవుడి గుడిలో)

చిత్రం: ప్రేమాభిషేకం (1981)

సాహిత్యం: దాసరి నారాయణ రావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



ఒక దేవుడి గుడిలో.. ఒక దేవత ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం ఒక దేవత గుడిలో.. ఒక దేవుని ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం.. ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం మరులు పూచిన పూలపందిరిలో మమతలల్లిన ప్రేమ సుందరికీ పట్టాభిషేకం.. పట్టాభిషేకం మనసు విరిచినా మనసు మరువనీ మధుర జీవిత మానవమూర్తికి మంత్రాభిషేకం.. మంత్రాభిషేకం రాగాల సిగలో అనురాగాల గుడిలో భావాలబడిలో.. అనుభవాల ఒడిలో వెలసిన రాగదేవత.. రాగాభిషేకం గెలిచిన ప్రేమవిజేత.. ప్రేమాభిషేకం ప్రేమాభిషేకం.. ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం.. ప్రేమకు పట్టాభిషేకం కలలచాటున పెళ్ళిపల్లకిలో కదలివచ్చిన పెళ్ళికూతురికీ పుష్పాభిషేకం.. పుష్పాభిషేకం పాట మారినా .. పల్లవి మార్చనీ ప్రణయలోకపు ప్రేమమూర్తికి స్వర్ణాభిషేకం.. స్వర్ణాభిషేకం స్వప్నాల నింగిలో.. స్వర్గాల బాటలో బంగారు తోటలో.. రతనాల కొమ్మకు విరిసిన స్వప్న సుందరీ.. క్షీరాభిషేకం కొలిచినప్రేమ పూజారీ.. అమృతాభిషేకం ప్రేమాభిషేకం.. ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం.. ప్రేమకు పట్టాభిషేకం ఒక దేవత గుడిలో ఒక దేవుడి ఒడిలో నిదురించే అనురాగం కురిపించే అభిషేకం ప్రేమాభిషేకం.. ప్రేమకు పట్టాభిషేకం ప్రేమాభిషేకం.. ప్రేమకు పట్టాభిషేకం

14, జనవరి 2022, శుక్రవారం

Premabhishekam : Na Kallu Cheputunnayi Song Lyrics (నా కళ్ళు చెబుతున్నాయి)

చిత్రం: ప్రేమాభిషేకం (1981)

సాహిత్యం: దాసరి నారాయణ రావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి




నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ ... నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ ప్రేమకే పెళ్ళనీ .. ఈ పెళ్ళే ప్రేమనీ ప్రేమా పెళ్ళి జంటనీ నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ ... నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని తోడంటే నేననీ .. చెలిమంటే నువ్వనీ నువ్వు నేను జంటనీ నూరేళ్ళ పంటనీ .. నూరేళ్ళ పంటనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ ... నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించా

Premabhishekam : Vandanam Abhivandanam Song Lyrics (వందనం అభివందనం)

చిత్రం: ప్రేమాభిషేకం (1981)

సాహిత్యం: దాసరి నారాయణ రావు

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి



వందనం అభివందనం నీ అందమే ఒక నందనం వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ పాదాభివందనం పాదాభివందనం.. పాదాభివందనం పాదాభివందనం... వందనం అభివందనం నీ అందమే ఒక నందనం చరణం 1 : కన్నులు పొడిచిన చీకటిలో... ఆరే దీపపు వెలుగుల్లో తీరని ఊహల రేవుల్లో... తీరం చేరని పడవల్లో వస్తానని నేను వస్తానని వస్తానని నేను వస్తానని తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి ఎదురు చూసిన సారిక అభిసారిక.. సారీ.. వందనం అభివందనం నీ అందమే...ఒక నందనం చరణం 2 : జీవితమన్నది మూడునాళ్ళని... యవ్వనమన్నది తిరిగిరాదని ప్రేమన్నది ఒక నటనమనీ... నీకంటూ ఎవరున్నారని ఉన్నారని ఎవరున్నారని ఉన్నానని నేను ఉన్నానని ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి ప్రేమపురానికి సెలవిచ్చి స్వర్గపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అభినయ మేనక..సారీ వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగ నిలచిన సుందరీ పాదాభివందనం పాదాభివందనం పాదాభివందనం పాదాభివందనం వందనం అభివందనం నీ అందమే ఒక నందనం