21, జనవరి 2022, శుక్రవారం

Siri Sampadalu : Ee Pagalu Reyigaa Pandu Vennelagaa Song Lyrics (ఈ పగలు రేయిగా)

చిత్రం: సిరి సంపదలు (1962)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల, ఎస్.జానకి

సంగీతం: మాస్టర్ వేణు



ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ ఆ కారణమేమి చెలీ.... వింతకాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి నిండు పున్నమి జాబిలి... ఓ....ఓ....ఓ మనసున తొణికే చిరునవ్వెందుకు అహా... ఓహో.. అహా.. ఆ.. ఆ... మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు వెండి వెన్నెల జాబిలి ... నిండు పున్నమి జాబిలి... పెదవుల మీదికి రానీవు ఆ....ఆ.. ఓ....ఓ.. ఆ....ఆ.. ఊ.... ఊ.. కన్నులు తెలిపే కథలనెందుకు. రెప్పలార్చి ఏమార్చేవు ఆఁ...ఆఁ..ఓ. ఓ... ఓ... కన్నులు తెలిపే కథలనెందుకు. రెప్పలార్చి ఏమార్చేవు చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని జడిసేవు 1 ఓహోహో... వెండి వెన్నెల జాబిలి ... నిండు పున్నమి జాబిలి... అగుపడదనుకుని నవ్వేవు అలుక చూపి అటువైపు తిరిగితే . -ఉహుహు. • అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకుని నవ్వేవు నల్లని జడలో మల్లెపూలు నీ నవ్వునకద్దము చూపేను.. - ఆహా... వెండివెన్నెల జాబిలి. నిండు పున్నమి జాబిలి. ఆహహాహా... ఆహహాహా... ఆహహాహా...ఆహహాహా... ఊహుహూ...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి