చిత్రం: సిరి సంపదలు (1962)
సాహిత్యం: శ్రీ శ్రీ
గానం: జిక్కి ,పి. సుశీల
సంగీతం: మాస్టర్ వేణు
వేణుగానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణయ్య కనిపించడెయ్
వేణుగానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణయ్య కనిపించడెయ్
ధోరా వయసున్న కన్నియల హృదయాలను
దోచుకున్నాడు విన్నాను కన్నులతో
అంత మొనగాడటే వట్టి కథలేనా
ఏదీ కనపడితే నిలవేసి అడగాలి వానినే
వేణుగానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణయ్య కనిపించడెయ్
వేణుగానమ్ము వినిపించెనే
మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట లేదు లేదంటూ లోకాలు చూపాడట మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందట లేదు లేదంటూ లోకాలు చూపాడట అంత మొనగాడట వింత కథలేనట ఏదీ కనపడితే కనులారా చూడాలి వాడినే
వేణుగానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణయ్య కనిపించడెయ్
వేణుగానమ్ము వినిపించెనే
దుడుకు క్రిష్నయ్య మడుగు లోన దూకాడట జడిసి రేపల్లె ప్రజలంతా మూగరట దుడుకు క్రిష్నయ్య మడుగు లోన దూకాడట జడిసి రేపల్లె ప్రజలంతా మూగరట ఘల్లు ఘల్ఘల్లన వొళ్ళు ఝళఝల్లన తాను ఫణిరాజు పాడగా పై తారంగంటాడట
వేణుగానమ్ము వినిపించెనే
చిన్ని కృష్ణయ్య కనిపించడెయ్
వేణుగానమ్ము వినిపించెనే