చిత్రం: నర్తనశాల(1963)
సాహిత్యం: సముద్రాల
గానం: ఎస్.జానకి
సంగీతం: సుసర్ల దక్షిణా మూర్తి
నరవరా... ఆ..ఆ...ఆ.. నరవరా ఓ కురువరా నరవరా ఓ కురువరా వీరుల నీకు సరి.. లేరని సరసులలో.. జాణవని విన్నారా.. కన్నారా విన్నారా.. కన్నారా కనులారా నరవరా ఓ కురువరా
సురపతీ నెదిరించి రణాన పశుపతీ మురుపించి బళాన సురపతీ నెదిరించి రణాన పశుపతీ మురుపించి బళాన సాటిలేని వీరుండన్న యశమును గన్నా సాటిలేని వీరుండన్న యశమును గన్నా అర్జున ఫల్గుణ పార్థ కిరీటి బిరుదుగొన్న విజయా నరవరా ఓ కురువరా
నినుగని తలవూచే ఉలూచి కొనుమని చేయిచాచే సుభద్రా నినుగని తలవూచే ఉలూచి కొనుమని చేయిచాచే సుభద్రా నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న అలరుల విలుతుని మొలుకుల గురియై వలపులమ్ముకొనురా
నరవరా ఓ కురువరా నరవరా ఓ కురువరా వీరుల నీకు సరి.. లేరని సరసులలో.. జాణవని విన్నారా.. కన్నారా విన్నారా.. కన్నారా కనులారా నరవరా ఓ కురువరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి