రచన: సముద్రాల సీనియర్
గానం: పి. సుశీల
సంగీతం: జి. నరసింహరావు
సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి సిరికళ్యాణపు బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణి బాసికమును నుదుటను కట్టి నుదుటను కట్టి పారాణిని పాదాలకు పెట్టి ఆ ఆ అ ఆ ఆ అ ఆ ఆ పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళికూతురై వెలసిన సీతా కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి సంపగి నూనెను కురులను దువ్వి కురులను దువ్వి సొంపుగ కస్తూరి నామము తీర్చి నామము తీర్చి చెంపగవాకి చుక్కను పెట్టి ఆ ఆ ఆ ఆ ఆ అ అ చెంపగవాకి చుక్కను పెట్టి పెళ్ళికొడుకై వెలిసిన రాముని కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి జానకి దోసిట కెంపుల ప్రోవై. కెంపుల ప్రోవై. రాముని దోసిట నీలపురాశై నీలపురాశై. ఆణిముత్యములు తలంబ్రాలుగా ఆ ఆ ఆ అ అ ఆ ఆ ఆణిముత్యములు తలంబ్రాలుగా ఇరవుల మెరిసిన సీతారాముల కళ్యాణం చూతమురారండి శ్రీసీతారాముల కళ్యాణం చూతమురారండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి