చిత్రం: తాత మనవడు(1972)
సంగీతం: రమేష్ నాయుడు
రచన: సి. నారాయణ రెడ్డి
గానం: పి. సుశీల
ఈనాడే బాబు నీ పుట్టిన రోజు ఈ ఇంటికే ....ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు ఈనాడే బాబు నీ పుట్టిన రోజు చిన్ని బాబు ఎదిగితే కన్నవారికానందం నెలవంక పెరిగితే నింగికే ఒక అందం చుక్కలు వేయెందుకు ఒక్క చంద్రుడే చాలు చుక్కలు వేయెందుకు ఒక్క చంద్రుడే చాలు తన వంశం వెలిగించే తనయుడొక్కడే పదివేలు ఈనాడే బాబు నీ పుట్టిన రోజు ఈ ఇంటికే ....ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు ఈనాడే బాబు నీ పుట్టిన రోజు కన్నవారి కలలు తెలుసుకోవాలి ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి కన్నవారి కలలు తెలుసుకోవాలి ఆ కలల కంట నీరు పెడితే తుడవాలి తనకు తాను సుఖపడితే తప్పుగాకున్నా.. తన వారినీ సుఖపెడితే ధన్యత ఓ నాన్నా ఈనాడే బాబు నీ పుట్టిన రోజు తండ్రి మాటకై కానకు తరలిపోయే రాఘవుడు అందుకే ఆ మానవుడు అయినాడు దేవుడు తల్లి చెరను విడిపించగ తలపడే ఆ గరుడుడు అందుకే ఆ పక్షీంద్రుడు అంతటి మహనీయుడు ఓ బాబు ....నువ్వు ఆ బాట నడవాలి.... ఓ బాబు.... నువ్వు ఆ బాట నడవాలి.... భువిలోన నీ పేరు ధ్రువతారగ వెలగాలి.... ధ్రువతారగ వెలగాలి.... ఈనాడే బాబు నీ పుట్టిన రోజు ఈ ఇంటికే ....ఈ ఇంటికే కొత్త వెలుగు వచ్చిన రోజు ఈనాడే బాబు నీ పుట్టిన రోజు....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి