చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు (1972)
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బెంగళూరు లత
సంగీతం: సి. సత్యం
పల్లవి: అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూట అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా ...మమతలమూట చరణం 1: దేవుడే లేడనె మనిషున్నాడు అమ్మేలేదను వాడు అసలే లేడు దేవుడే లేడనె మనిషున్నాడు అమ్మేలేదను వాడు అసలే లేడు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు ఆ తల్లి సేవ చేసుకొనే బ్రతుకే బ్రతుకు అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా..మమతలమూట చరణం 2:
అమ్మంటే అంతులేనె సొమ్మురా అది ఏనాటికి తరగనె భాగ్యమ్మురా అమ్మ మనసు అమృతమే చిందురా' అమ్మ ఓడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా అమ్మ అన్నది ఒక కమ్మని మాట అది ఎన్నెన్నో తెలియని మమతలమూటా...మమతలమూట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి