చిత్రం: ఆత్మీయులు(1968)
సాహిత్యం: దాశరథి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
పల్లవి:
చిలిపినవ్వుల నిను చూడగానే... వలపు పొంగేను నాలోనే...
వలపు పొంగేను నాలోనే
ఎన్ని జన్మల పుణ్యాలఫలమో. నిన్ను నే చేరుకున్నాను...
నిన్ను నే చేరుకున్నాను
చరణం 1:
చూపుల శృంగారమోలికించినావు
ఆ.ఆ.ఆ.ఆ
చూపుల శృంగారమోలికించినావు... మాటల మధువెంతో చిలికించినావు
వాడని అందాల ...వీడని బంధాల... తోడుగ నడిచేములే
చిలిపినవ్వుల నిను చూడగానే... వలపు పొంగేను నాలోనే...
ఎన్ని జన్మల పుణ్యాలఫలమో. నిన్ను నే చేరుకున్నాను...
అహ.హ.హ.ఆ... ఓ... ఓ... ఓ.
చరణం 2:
నేను నీదాననే .నీవు నా వాడవే.నను వీడి పోలేవులే... కన్నుల ఉయ్యాలలూగింతునోయి... కన్నుల ఉయ్యాలలూగింతునోయి... చూడని స్వర్గాలు చూపింతునోయి తియ్యని సరసాల. తీరని సరదాల... హాయిగ తేలేములే... ఎన్ని జన్మల పుణ్యాలఫలమో. నిన్ను నే చేరుకున్నాను... నిన్ను నే చేరుకున్నాను చిలిపినవ్వుల నిను చూడగానే... వలపు పొంగేను నాలోనే... వలపు పొంగేను నాలోనే... అహ... హ.ఆ.అ.ఆ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి