చిత్రం: ఆత్మీయులు(1968)
సాహిత్యం: ఆరుద్ర
గానం: పి. సుశీల
సంగీతం: సాలూరి.రాజేశ్వర రావు
పల్లవి : స్వాగతం... ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు స్వాగతం... ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు చరణం 1 : కొంగు తగిలిందా పొంగిపోతారు... కొంగు తగిలిందా పొంగిపోతారు... కోరి రమ్మంటే బిగిసిపోతారు ఎందుకో... ఎందుకో... ఈ బింకము అలిగినకొలది అందము... అబ్బాయిగారి కోపము అలిగినకొలది అందము... అబ్బాయిగారి కోపము పిలిచిన ప్రేయసికి ఇదేనా కానుక.. మీ కానుక బెట్టుచాలును దొరగారు.. స్వాగతం... ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు చరణం 2 : అందమంతా విందు చేస్తే అదిరిపడతారే అందమంతా విందు చేస్తే అదిరిపడతారే పొందుకోరి చెంత చేర బెదిరిపోతారే సరసమొ... విరసమొ... ఈ మౌనము అందిన చిన్నది చులకన.. అందనిదెంతో తియ్యన అందిన చిన్నది చులకన.. అందనిదెంతో తియ్యన అవతల పెట్టండి... తమాషా పోజులు... మహారాజులు అధిక చక్కని దొరగారు... స్వాగతం... ఓహో చిలిపి నవ్వుల శ్రీవారు సోగకనులు సైగ చేస్తే ఆగలేని దొరగారు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి