చిత్రం: ఊరికి మొనగాడు (1981)
సాహిత్యం: ఆరుద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల
సంగీతం: చక్రవర్తి
పల్లవి :
ఇదిగో తెల్ల చీరా ఇవిగో మల్లె పూలు
ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లె పూలు
తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పెట్టుకో
తెల్లార్లు నా పేరు వల్లించుకో
ఎందుకు..
ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి..
ఇదిగో తెల్ల చీరా ఇవిగో మల్లె పూలు
ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లె పూలు
తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా
తెల్లార్లు నీ పేరు వల్లించుతా
ఎందుకు..
ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి
చరణం 1 :
కాకి చేత పంపిస్తే కబురందిందా కళ్ళారా చూడగానే కథ తెలిసిందా ||2|| ఊరుకున్నా ఊసు పోనీ ఊవిళ్ళు ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ ||2|| ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఆది లోనే బారసాల చేసుకోవా సీమంతం
ఇదిగో తెల్ల చీరా ఇవిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లె పూలు చరణం 2:
సూది కోసం సోదికెలితే సుడి తిరిగిందా మోగమాటమ్ అనుకుంటే ముంచుకొచ్చిందా ||2|| కట్టవయ్యా నట్టింటా ఉయ్యాలా... గొడ్డైనా అయ్యో నువ్వే ఉపాలా.. ||2|| నేనే జోల పాడుతుంటే నువ్వు నిద్దర పోతావా అయ్యా మీరు పక్కనుంటే అసలే నిద్దర పడుతుందా.
ఇదిగో తెల్ల చీరా ఇవిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లె పూలు తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పెట్టుకో తెల్లార్లు నా పేరు వల్లించుకో ఎందుకు.. ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి