చిత్రం: ఆత్మ బలం (1964)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల, ,పి. సుశీల
సంగీతం: కె. వి. మహదేవన్
పల్లవి: ఎక్కడకి పోతావు చిన్నవాడా... ఎక్కడకి పోతావు చిన్నవాడ నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడ ఎక్కడకి పోతావు చిన్నవాడ నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడ చరణం 1: కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్లలేవు వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్లలేవు వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు మనసు మనసు తెలిసినాక మారలేవు మనసు మనసు తెలిసినాక మారలేవు మారినా మనిషిగా బతకలేవు చరణం 2: నన్నిడిచి నువ్వెళితే నీవెంట నేనుంట నిన్నిడిచి నేవెళితే నువు బతకలేవంట ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ నన్నిడిచి నువ్వెళితే నీవెంట నేనుంట నిన్నిడిచి నేవెళితే నువు బతకలేవంట ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా ప్రేమంటే ఇంతేరా పిచ్చివాడా ఎక్కడకి పోతావు చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా ఎక్కడకి పోతావు చిన్నదానా నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా చరణం 3: హా..పాడు ఊ.. పాడు... పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆడేది ఆట కాదు పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆడేది ఆట కాదు పాడమంటే పాడేది పాట కాదు ఆడమంటే ఆడేది ఆడేది ఆట కాదు ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదూ పువ్వైనా నవ్వేనా నీకోసం పూయదు ఎక్కడికైనా పోవోయ్ చిన్నవాడా నీ చూపులను ఓపలేను పిల్లవాడా ఎక్కడికి పోలేనూ చిన్నదానా నీ చూపుల్లో చిక్కుకుంటి పిల్లదానా ఎక్కడికి పోలేనూ చిన్నదానా నీ చూపుల్లో చిక్కుకుంటి పిల్లదానా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి