Aatma Balam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aatma Balam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జనవరి 2025, శుక్రవారం

Aatma Balam : Gilli Kajjalu Song Lyrics (గిల్లి కజ్జాలు )

చిత్రం: ఆత్మ బలం (1964)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల,పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్



పల్లవి: 

గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి 
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి 
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి 
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయీ 
బుల్లి కారున్న షోకిల అబ్బాయి 
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయ 
బుల్లి కారున్న షోకిల అబ్బాయి 
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి 

చరణం 1: 

వయసు తోటి దోరదోర సొగసులొస్తాయి 
సొగసులతో ఓరఓర చూపులొస్తాయ 
వయసు తోటి దోరదోర సొగసులొస్తాయి 
సొగసులతో ఓరఓర చూపులొస్తాయి 
చూపులతో లేని పోని గీరలొస్తాయి 
ఆ గీరలన్ని జారిపోవు రోజులొస్తాయి 
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి 
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి 
కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి 
కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి 
కుర్రకారు కోరికలు గుర్రాలవంటివి 
కళ్ళాలు వదిలితే కదం తొక్కుతాయి 
పట్టు తప్పినంతనే పరువే తీస్తాయి 
ఒళ్ళు దగ్గరుంచుకుంటే మంచిదబ్బాయీ... ఈ... 
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి 
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి 

చరణం 2: 

మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి 
హృదయమంత పాకుతుంది హుషారైన హాయి 
మొదట మొదట కళ్ళతోటి మొదలుపెట్టి లడాయి 
హృదయమంత పాకుతుంది హుషారైన హాయి 
కలకాలం ఉండదు ఈ పడుచు బడాయి 
తొలినాడే చల్లబడి పోవునమ్మాయి 
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి 
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి 
కళ్ళు చూసి మోసపోయి కలవరించకు 
ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు 
కళ్ళు చూసి మోసపోయి కలవరించకు 
ఓరచూపు కోరచూపు ఒకటనుకోకు 
ఇస్తేను హృదయమెంతో మెత్తనైనది 
ఎదురుతిరిగితే అదే కత్తి వంటిదీ... ఈ... 
గిల్లి కజ్జాలు తెచ్చుకునే అమ్మాయి 
నీ కళ్ళల్లో ఉన్నది భలే బడాయి 
బుల్లి కారున్న షోకిలా అబ్బాయి 
నీ పోజుల్లో ఉన్నది భలే బడాయి


Aatma Balam : Tellavaaraneeku Ee Reyini Song Lyrics (తెల్లవారనీకు ఈ రేయిని)

చిత్రం: ఆత్మ బలం (1964)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల,పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్



పల్లవి:

తెల్లవారనీకు ఈ రేయిని...
తీరిపోనీకు ఈ తీయనీ హాయిని
తెల్లవారనీకు ఈ రేయిని..
తీరిపోనీకు ఈ తీయనీ హాయిని...
తెల్లవారనీకు ఈ రేయిని...

చరణం 1:

నీ కన్నులలో మధువులన్ని జుర్రుకొని..
ఆ కైపులో లోకాలే మరువనీ...
నీ కన్నులలో మధువులన్ని జుర్రుకొని..
ఆ కైపులో లోకాలే మరువనీ..
మనసులో మనసునై మసలనీ..
మనసులో మనసునై మసలనీ..
నీ మనిషినై మమతనై మురిసిపోనీ...
తెల్లవారనీకు ఈ రేయిని..
తీరిపోనీకు ఈ తీయని హాయిని..
తెల్లవారనీకు ఈ రేయిని..

చరణం 2:

నీ కురులే చీకటులై కప్పివేయని..
ఆ చీకటిలో పగలు రేయి ఒకటై పోని..
నీ కురులే చీకటులై కప్పివేయని..
ఆ చీకటిలో పగలు రేయి ఒకటై పోని..
నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ..
నీ వలపు వాన కురిసి కురిసి తడిసిపోనీ
తడియారని హృదిలో నను మొలకలెత్తని..ఈ..ఈ..
తెల్లవారనీకు ఈ రేయిని..
తీరిపోనీకు ఈ తీయనీ హాయిని...
తెల్లవారనీకు ఈ రేయిని

చరణం 3:

మల్లెపూల తెల్లదనం మనసు నిండని
అల్లరి పడుచుదనం కొల్లబోనీ..
మల్లెపూల తెల్లదనం మనసు నిండని
అల్లరి పడుచుదనం కొల్లబోనీ..
కొల్లగొన్న మనసే నా ఇల్లని
కొల్లగొన్న మనసే నా ఇల్లని
చల్లగా కాపురమూ ఉండిపోనీ...
తెల్లవారనీకు ఈ రేయిని...
తీరిపోనీకు ఈ తీయని హాయిని..
తెల్లవారనీకు ఈ రేయిని..

Aatma Balam : Naalugu kallu Rendainaayi Song Lyrics (నాలుగు కళ్ళు రెండైనాయి )

చిత్రం: ఆత్మ బలం (1964)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్



పల్లవి: 

నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి 
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి 
ఉన్న మనసు నీకర్పణచేసి లేనిదాననైనాను 
ఏమీ లేనిదాననైనాను 

చరణం 1: 

కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయి 
కనులకు కలలే బరువైనాయి కన్నీళ్ళయినా కరువైనాయి 
రెండూ లేక పండురేకులై ఎందుకు నాకీ కనుదోయి 
ఇంకెందుకు నాకీ కనుదోయి 
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి 
ఉన్న మనసు నీకర్పణచేసి లేనిదాననైనాను 
ఏమీ లేనిదాననైనాను 

చరణం 2: 

కదిలే శిలగా మారిపోతిని కథగానైనా మిగలనైతిని 
కదిలే శిలగా మారిపోతిని కథగానైనా మిగలనైతిని 
నిలువుగ నన్ను దోచుకుంటివి నిరుపేదగ నే 
నిలిచిపోతిని నిరుపేదగ నే నిలిచిపోతిని 
నాలుగు కళ్ళు రెండైనాయి రెండు మనసులు ఒకటైనాయి 
ఉన్న మనసు నీకర్పణచేసి లేనిదాననైనాను 
ఏమీ లేనిదాననైనాను

Aatma Balam : Parugulu Teese Song Lyrics (పరుగులు తీసే నీ వయసునకూ)

చిత్రం: ఆత్మ బలం (1964)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల,పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్



పల్లవి:

ఓహో హొహూఎఓ హో...
పరుగులు తీసే నీ వయసునకూ పగ్గం వేసెను నా మనసూ
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు
ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహ
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు
ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహ
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

చరణం 1:

ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు
ఓహోయని పలికెను నీ వలపు
ఓయని పిలిచే నా పిలుపునకు ఓయని పలికెను నీ వలపు
ఓహోయని పలికెను నీ వలపు
ఓయని పలికే నీ వలపునకు తీయగ మారెను నా తలపు
తియతీయగ మారెను నా తలపు ఒహొహొహొ హొహొహొ
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

చరణం 2:

తొణకని బెణకని నీ బిగువులతో దోబూచాడెను నా నగవూ
అహ దోబూచాడెను నా నగవూ
దోబూచాడే నా నగవులలో దోరగ పండెను నీ మరులు
దోరదోరగ పండెను నీ మరులూ
ఒహొహొహొ హొహొహొ
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

చరణం 3:

లేదనిపించే నీ నడుము అహహా నాదనిపించెను ఈ క్షణము ఒహో
లేదనిపించె నీ నడుము నాదనిపించెను ఈ క్షణము
ఉందో లేదో ఈ జగము
ఉందువు నీవు నాలో సగము
ఇది నిజము కాదనుము
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు
ఉరకలు వేసే నా మనసునకు ఉసిగొలిపెనులే నీ సొగసు అహాహహహ
పరుగులు తీసే నీ వయసునకు పగ్గం వేసెను నా మనసు

1, ఫిబ్రవరి 2022, మంగళవారం

Aatma Balam : Ekkadiki Poothavu Song Lyrics (ఎక్కడకి పోతావు చిన్నవాడా... )

చిత్రం: ఆత్మ బలం (1964)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్


పల్లవి:
ఎక్కడకి పోతావు చిన్నవాడా... ఎక్కడకి పోతావు చిన్నవాడ
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడ ఎక్కడకి పోతావు చిన్నవాడ
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లవాడ
చరణం 1:
కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్లలేవు
వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు
కళ్ళు కళ్ళు కలిసినాక వెళ్లలేవు
వెళ్ళినా మూన్నాళ్ళు ఉండలేవు మనసు మనసు తెలిసినాక మారలేవు
మనసు మనసు తెలిసినాక మారలేవు
మారినా మనిషిగా బతకలేవు
చరణం 2:
నన్నిడిచి నువ్వెళితే నీవెంట నేనుంట
నిన్నిడిచి నేవెళితే నువు బతకలేవంట
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
నన్నిడిచి నువ్వెళితే నీవెంట నేనుంట
నిన్నిడిచి నేవెళితే నువు బతకలేవంట ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా
ఇది నీ గొప్ప నా గొప్ప కాదు పిల్లోడా
ప్రేమంటే ఇంతేరా పిచ్చివాడా ఎక్కడకి పోతావు చిన్నదానా
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా
ఎక్కడకి పోతావు చిన్నదానా
నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా
చరణం 3:
హా..పాడు ఊ.. పాడు... పాడమంటే పాడేది పాట కాదు
ఆడమంటే ఆడేది ఆడేది ఆట కాదు పాడమంటే పాడేది పాట కాదు
ఆడమంటే ఆడేది ఆడేది ఆట కాదు
పాడమంటే పాడేది పాట కాదు
ఆడమంటే ఆడేది ఆడేది ఆట కాదు ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదూ
పువ్వైనా నవ్వేనా నీకోసం పూయదు
ఎక్కడికైనా పోవోయ్ చిన్నవాడా
నీ చూపులను ఓపలేను పిల్లవాడా ఎక్కడికి పోలేనూ చిన్నదానా
నీ చూపుల్లో చిక్కుకుంటి పిల్లదానా
ఎక్కడికి పోలేనూ చిన్నదానా
నీ చూపుల్లో చిక్కుకుంటి పిల్లదానా

18, జనవరి 2022, మంగళవారం

Aatma Balam : Chitapata Chinukulu Song Lyrics (చిటపట చినుకులు)

చిత్రం: ఆత్మ బలం (1964)

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్



పల్లవి:
చిటపట చినుకులు పడుతూ ఉంటే..
చెలికాడె సరసన ఉంటే..
చెట్టాపట్టగ చేతులు పట్టి
చెట్టు నీడకై పరుగిడుతుంటే...
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ ఉరుములు పెళపెళ ఉరుముతు ఉంటే..
మెరుపులు తళ తళ మెరుస్తు ఉంటే..
మెరుపు వెలుగులో చెలి కన్నులలో
బిత్తర చూపులు కనపడుతుంటే..
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయి
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
చరణం 1:
కారు మబ్బులు కమ్ముతు ఉంటే ...కమ్ముతు ఉంటే..ఓ..ఓ..
కళ్ళకు ఎవరూ కనపడకుంటే...కనపడకుంటే ఆ..
కారు మబ్బులు కమ్ముతు ఉంటే ...కమ్ముతు ఉంటే..ఓ..ఓ..
కళ్ళకు ఎవరూ కనపడకుంటే...కనపడకుంటే ఆ జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే
చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ...
చరణం 2:
చలి చలిగా గిలివెస్తుంటే..ఆ హా హా
గిలిగింతలు పెడుతూ ఉంటే..ఓహోహో...
చలి చలిగా గిలివెస్తుంటే..ఆ హా హా
గిలిగింతలు పెడుతూ ఉంటే.. చెలి గుండెయిలో రగిలే వగలే
చెలి గుండెయిలో రగిలే వగలే
చలిమంటలుగా అనుకుంటే...
చెప్పలేనీ ఆ హాయీ ఎంతో వెచ్చగ ఉంటుందోయీ... చిటపట చినుకులు పడుతూ ఉంటే..
చెలికాడె సరసన ఉంటే..
చెట్టాపట్టగ చేతులు పట్టి
చెట్టు నీడకై పరుగిడుతుంటే...
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయీ