4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Aazad : Sudigalilo Thadi Oohalu Song Lyrics (సుడిగాలిలో )

చిత్రం: ఆజాద్ (2000)

సాహిత్యం: వేటూరి

సంగీతం: మణి శర్మ

గానం: హరిహరన్, , కె.యస్.చిత్ర



పల్లవి: సుడిగాలిలో తడి ఊహలో చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు చెలి నేనుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు తెలిసిందమ్మ ఆడదానినని తెల్లారేసరికి పిలిచిందమ్మా పురుషా అంటూ మళ్ళి మళ్ళి ఒళ్ళే తుళ్ళింతై ఓయమ్మో ఈ హాయమ్మో అమ్మమ్మో సుడిగాలిలో తడి ఊహలో చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు చెలి నేనుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు చరణం: 1 నా ఊహలో పుట్టుకొచ్చాడే ఊరించే ఈ కళ్ళతో ఏ దాహమో పుట్టుకొచ్చిందే ఎన్నెళ్ళ ఎంగిళ్ళతో వాడు జతపడితే ఎన్ని కితకితలు అందాలలో ఆమె కనపడితే ఎన్ని కుతకుతలు సందేళలో ఏమీ తోచదు పొద్దు పోదురా ముద్దు చేసిపోరా రెప్పే వాలదు రేపు రాదులే తుళ్ళే పాపా ఒళ్ళొకొచ్చెయ్ వే... ఓయమ్మో మా యమ్మో అమ్మమ్మో సుడిగాలిలో తడి ఊహలో చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు చెలి నీవుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు చరణం: 2 సంపెంగ పువ్వంటి నీ ముక్కు చల్లింది గంధాలు కౌగిట్లో సిరివెన్నెలే రువ్వు నీ నవ్వు నిను చేర రమ్మంది చీకట్లో దాని కిలకిలలకెన్ని కోకిలలు నా గూటిలో వాడి గుసగుసలకెన్ని కోరికలు నా గుండెలో కాలం సాగదు కాలు ఆగదు కాదు రేపు అనకే దిండు కాపురం చెయ్యలేదులే పాలు పండు అన్నీ నీతోనే... ఓయమ్మో ఈ హాయమ్మో అమ్మమ్మో సుడిగాలిలో తడి ఊహలో చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు చెలి నీవుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు తెలిసిందమ్మ ఆడదానినని తెల్లారేసరికి పిలిచిందమ్మా పురుషా అంటూ మళ్ళి మళ్ళి ఒళ్ళే తుళ్ళింతై ఓయమ్మో ఈ హాయమ్మో అమ్మమ్మో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి