Aazad లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Aazad లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

24, డిసెంబర్ 2023, ఆదివారం

Aazad : So So Sonare Song Lyrics (సో సో సో అరె సోనారే)

చిత్రం: ఆజాద్ (2000)

సాహిత్యం: చంద్ర బోస్

సంగీతం: మణి శర్మ

గానం: ఉదిత్ నారాయణ్, , కె.యస్.చిత్ర




సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే మాపటికొస్తే మాయ మచ్చింద్రే యమరే అదిరే నీ అందం నాతో జమరే కుదిరే ముదిరే ఈ సరసం వేస్తూ నెమరే అరె హాయ్ అరె హాయ్ అరె హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే మాపటికొస్తే మాయ మచ్చింద్రే సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే చరణం: 1 చిన్న ముళ్ళు వెనకాల పెద్దముళ్లు తీరగాల కన్నె పిల్ల వెనకాల కుర్రవాడు నడవాలి పన్నెండైతే పెనవేయాలి హో హో హో హో సమయం అక్కడ స్టాప్ అవ్వాలి హో హో హో ఒడిలో వడిగా మొదలవని టిక్ టిక్ గొడవే అరె హాయ్ అరె హాయ్ అరె హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే హేయ్ జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే మాపటికొస్తే మాయ మచ్చింద్రే చరణం: 2 నవ్వులోనే పుడుతుండే అరె వెయ్యి వాట్ల విద్యుత్తే నీ హార్ట్ బాటరీ లోనే అది అట్టిపెట్టుకో అంటే బిల్లులు కట్టే బాదే మాయం హో హో హో హో చార్జిలు పెంచితే మనకే నష్టం హో నాకే ఓకే నీ పవరింకొకరికి షాకే అరె హాయ్ అరె హాయ్ అరె హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్ అరె సో సో సో అరె సోనారే నిను చూస్తే నోరూరే దగ్గరికొస్తే దిల్ మాంగే మోరే జో జో జో అరె ఎంజోరే చేస్తున్నా జోహారే మాపటికొస్తే మాయ మచ్చింద్రే యమరే అదిరే నీ అందం నాతో జమరే కుదిరే ముదిరే ఈ సరసం వేస్తూ నెమరే అరె హాయ్ అరె హాయ్ అరె హాయ్ హాయ్ హాయ్ హాయ్ హాయ్


Aazad : Hayi Hayi Nayaka Song Lyrics (హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... )

చిత్రం: ఆజాద్ (2000)

సాహిత్యం: వేటూరి

సంగీతం: మణి శర్మ

గానం: సుఖ్వీందర్ సింగ్, , కె.యస్.చిత్ర




హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక చీర దులిపేసే చూపులకు జోహారు సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు ఒహోహోహో ........ హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక ఎక్కడిదో ఈ వయసు చెలీ దక్కెనులే నీ దినుసు తొక్కిడిలో నా సొగసు యమా ఉస్కులడి నా మనసు మంచాలలో మల్లె కంచాలలో వండి వార్చాను వయ్యారి నా తళుకులు చెక్కిళ్ళలో వాటి పక్కిళ్ళలో దిద్దుకున్నాను ముద్దులతో నా తెలుగులు గుట్టు రైక ముడి పట్టు కదా న పరువు అది ఫట్టుమనే బీటు కదా నా దరువు హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక ఒత్తిడిలో ఒక్క క్షణం చిత్తడిలో అగ్ని కణం అందుకనే ఆడతనం ముద్దులకే మూలధనం ఈడన్నది పుంజు కోడైనది దాని కొక్కొరొకో నీకొరకేలే తెలుసుకో తోడన్నది కొత్త జోడైనది దాని జోరు మరి ఆగదులే ఈ వయసులో కన్నె గువ్వ చెలి దువ్వి మరీ పోగొడతా ఉన్న కోడె గిలి తవ్వి మరి రాబడతా హాయ్ హాయ్ నాయకా...అత్తమ్మ కొడకా... నా సొత్తు యావత్తు నీదింక సై సై బాలిక అందాల చిలక నీ సోకు నాజూకు నాదింక చీర దులిపేసే చూపులకు జోహారు సిగ్గు చిదిమేసే కోరికలే నా జోరు ఒహోహోహో ........ ఒహోహోహో


4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Aazad : Sudigalilo Thadi Oohalu Song Lyrics (సుడిగాలిలో )

చిత్రం: ఆజాద్ (2000)

సాహిత్యం: వేటూరి

సంగీతం: మణి శర్మ

గానం: హరిహరన్, , కె.యస్.చిత్ర



పల్లవి: సుడిగాలిలో తడి ఊహలో చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు చెలి నేనుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు తెలిసిందమ్మ ఆడదానినని తెల్లారేసరికి పిలిచిందమ్మా పురుషా అంటూ మళ్ళి మళ్ళి ఒళ్ళే తుళ్ళింతై ఓయమ్మో ఈ హాయమ్మో అమ్మమ్మో సుడిగాలిలో తడి ఊహలో చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు చెలి నేనుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు చరణం: 1 నా ఊహలో పుట్టుకొచ్చాడే ఊరించే ఈ కళ్ళతో ఏ దాహమో పుట్టుకొచ్చిందే ఎన్నెళ్ళ ఎంగిళ్ళతో వాడు జతపడితే ఎన్ని కితకితలు అందాలలో ఆమె కనపడితే ఎన్ని కుతకుతలు సందేళలో ఏమీ తోచదు పొద్దు పోదురా ముద్దు చేసిపోరా రెప్పే వాలదు రేపు రాదులే తుళ్ళే పాపా ఒళ్ళొకొచ్చెయ్ వే... ఓయమ్మో మా యమ్మో అమ్మమ్మో సుడిగాలిలో తడి ఊహలో చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు చెలి నీవుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు చరణం: 2 సంపెంగ పువ్వంటి నీ ముక్కు చల్లింది గంధాలు కౌగిట్లో సిరివెన్నెలే రువ్వు నీ నవ్వు నిను చేర రమ్మంది చీకట్లో దాని కిలకిలలకెన్ని కోకిలలు నా గూటిలో వాడి గుసగుసలకెన్ని కోరికలు నా గుండెలో కాలం సాగదు కాలు ఆగదు కాదు రేపు అనకే దిండు కాపురం చెయ్యలేదులే పాలు పండు అన్నీ నీతోనే... ఓయమ్మో ఈ హాయమ్మో అమ్మమ్మో సుడిగాలిలో తడి ఊహలో చెలి సోకెనమ్మ ఏవో చలి ఊసులు చెలి నీవుగా తొలిసారిగా చెలరేగెనమ్మ ఎన్నో గిలి కేకలు తెలిసిందమ్మ ఆడదానినని తెల్లారేసరికి పిలిచిందమ్మా పురుషా అంటూ మళ్ళి మళ్ళి ఒళ్ళే తుళ్ళింతై ఓయమ్మో ఈ హాయమ్మో అమ్మమ్మో

4, జూన్ 2021, శుక్రవారం

Aazad : Kala Anuko Song Lyrics (కల అనుకో కలదనుకో నాలో ప్రేమా)

చిత్రం: ఆజాద్ (2000)

సాహిత్యం: వేటూరి

సంగీతం: మణి శర్మ

గానం: హరిహరన్, , మహాలక్ష్మి అయ్యర్


కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా (2) కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా ఓ.. నిను చూడనీ నిశిరాతిరి నిదరైనపోని కనుల పాపవో ఒహో ఓ.. నిను తాకని నిమిషాలలో కునుకైన రాక కుమిలే భాదవో గాలుల్లో ఊసులు కళ్ళల్లో ఆశలు కౌగిట్లో పూసిన కామాక్షి పువ్వులు ఏ తోటవైనా నీ పూజకేలే కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా హో.. మలి సందెలో నులి వెచ్చగా చలి కాచుకున్న చనువే హాయిలే ఓ.. నడిరేయిలో నడుమెక్కడో తడిమేసుకున్న గొడవే తీపిలే ఓ.. వీణల్లో తీగలా తీగల్లో మూగలా మీటే కవ్వింతలో పాటే కళ్యాణిగా నా పాట వింటే నీ పైట జారే కల అనుకో కలదనుకో నాలో ప్రేమా అవుననుకో కాదనుకో నీవే ప్రేమా పడిపోయా ప్రేమలో పరువాలా సాక్షిగా పడదామా పెళ్ళిలో పదిమంది సాక్షిగా ప్రేమించుకుందాం ఏ జన్మకైనా