4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

President Gari Pellam : Paruvaala kodi Song Lyrics (పరువాల కోడి)

చిత్రం: ప్రెసిడెంట్ గారి పెళ్ళాం (1992)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం.ఎం.కీరవాణి



పరువాల కోడి కొకొరొక్కొ అన్నదీ
బలిసింది బాడి పొగరెక్కి ఉన్నదీ
నాటు దెబ్బ పడీతే...కోలాట కొట్టిస్తా
నీ ఆట పట్టిస్తా
రూటు మార్చికొడితే
శివ తాండవాల చిచ్చుపెట్టి తొడగొడతాలే బుడతా

పరువాల కోడి కొకొరొక్కొ అన్నదీ
పసివాడి బాడి పదునెక్కి ఉన్నదీ
నాటు దెబ్బ పడీతే...కోలాట కొట్టిస్తా
నీ ఆట పట్టిస్తా
రూటు మార్చికొడితే
శివ తాండవాల చిచ్చుపెట్టి తొడగొడతాలే బుడతా

దెబ్బకు దెబ్బ తీసావంటె అదిరిపోతావులేవె బ్రతికిపోవే
యెత్తుకు యెత్తు వేసానంటె యెగిరిపోతావులేరా రసికవీరా
చెడిపోకు ముల్లు మీద ఆకుల్ల
పడి పోకు పల్లెటురి బైతుల్లా
నలిపేస్తా నాగమల్లి మొగ్గలా
దులిపేస్తా దుమ్ము నీకు మూతగా
నాకు తిక్క రేగితే నీ పీట లాగేస్తా సైఆటె ఆడేస్తా
టౌను పోసు కొడితే కొస రాజు పాట పాడి నిన్ను పదగుడతాలే మిడతా

పరువాల కోడి కొకొరొక్కొ అన్నదీ
పసివాడి బాడి పదునెక్కి ఉన్నదీ

చింపాంజీల చిందేసావా చిరిగిపోతుంది కాని చిలిపి రాణీ
క్యాబ్రె పట్టు పట్టానంటె అదిరిపోతావు రాజ అడుసుకూజా
ఓ కాంతా నీకు వెన్ను పోటునీ
సమంత ఫాక్స్ నాకు సాటిలే
మువ్వలున్న ముద్ద పప్పు నీవులే
గజ్జలున్న గంగిరెద్దు కానులే
పిచ్చి కూత పెడితే..నీ పీట లేపేస్త నీ సీటు చించేస్తా
కొత్త ఊపుకెడితే కుదురైన పాత కూచిపూడి మొదలెడతాలె..బుడతా

పరువాల కోడి కొకొరొక్కొ అన్నదీ
బలిసింది బాడి పొగరెక్కి ఉన్నదీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి