26, ఫిబ్రవరి 2022, శనివారం

Adrushtavanthalu : Mokkajonna Thotalo Song Lyrics (మొక్కజొన్న తోటలో..)

చిత్రం: అదృష్టవంతులు (1969)

సాహిత్యం: వెంకటరత్నం

గానం: పి.సుశీల

సంగీతం: కె. వి. మహదేవన్



మొక్కజొన్న తోటలో... ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య చుక్కలన్ని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ చుక్కలన్ని కొండ మీద సోకు చేసుకునే వేళ చల్లగాలి తోటకంత చక్కలిగిలి పెట్టు వేళ పొద్దు వాలినంతనే సద్దు మణగనిచ్చిరా పొద్దు వాలినంతనే సద్దు మణగనిచ్చిరా వేళ దాటి వస్తినా వెన్నక్కి తిరిగి పోతివా తంటా మన ఇద్దరికి తప్పదు మామయ్యా తప్పదు తప్పదు మామయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు వంగ తోట మలుపు కాడ కొంగు లాగినపుడు మొన్న రేతిరి జాతరలో కన్ను గీటినపుడు వంగ తోట మలుపు కాడ కొంగు లాగినపుడు కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా తప్పదు తప్పదు మామయ్యా మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచె కాడ కలుసుకో మరువకు మామయ్య నువ్వు మరువకు మరువకు మామయ్య గడ్డిబళ్ళ ఎనాకతల గమ్మత్తుగ నక్కిరా ఊర చెరువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా.. గడ్డిబళ్ళ ఎనాకతల గమ్మత్తుగ నక్కిరా ఊర చెరువు రెల్లు పక్క వొంగి వొంగి నడిచిరా అయినవాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాను అయినవాళ్ళ కళ్ళబడకు అల్లరి పాలవుతాను గుట్టు బయట పెడితివా గోలగాని చేస్తినా తంటా మన ఇద్దరికీ తప్పదు మామయ్యా తప్పదు తప్పదు మామయ్యా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి