చిత్రం: ఆనంద భైరవి (1983)
సాహిత్యం: దేవులపల్లి కృష్ణ శాస్త్రి
సంగీతం: రమేష్ నాయుడు
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి
కొలువైతివా... రంగశాయి హాయి.. కొలువైతివా... రంగశాయి కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి కొలువైతివా... రంగశాయి... సిరి మదిలో పూచి తరచి రాగము రేపి సిరి మదిలో పూచి తరచి రాగము రేపి చిరునవ్వు విరజాజులేవోయి.. ఏవోయి... చిరునవ్వు విరజాజులేవోయి.. ఏవోయి... కొలువైతివా... రంగశాయి.. సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట సిరి మోవి దమ్మికై మరి మరి క్రీగంట పరచేటి ఎలదేటులేవోయి... ఏవోయి పరచేటి ఎలదేటులేవోయి... ఏవోయి కొలువైతివా... రంగశాయి... ఔరా.. ఔరౌరా... ఔరా... ఔరౌరా... రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి రంగారు జిలుగు బంగారు వలువ సింగారముగ ధరించి వురమందు తులసి సరులంతు కలసి మణి అందముగ వహించి వురమందు తులసి సరులంతు కలసి మణి అందముగ వహించి సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి సిస్తైన నొసట కస్తూరి బొట్టు ముస్తాబుగ ధరించి ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి ఎలదమ్మి కనుల ఎలదేటి కొనల తులలేని నెనరులుంచి జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి జిలి బిలి పడగల శేషాహి తెలిమల్లె శయ్య శయనించి ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ ముజ్జగములు మోహంబున తిలకింపగ.. పులకింపగ శ్రీ రంగ మందిర నవసుందరా పరా శ్రీ రంగ మందిర నవసుందరా పరా శ్రీ రంగ మందిర నవసుందరా పరా కొలువైతివా... రంగశాయి... హాయి.. కొలువైతివా... రంగశాయి... కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి కొలువైన నిను చూడ.. కలవా కన్నులు వేయి కొలువైతివా... రంగశాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి