9, ఫిబ్రవరి 2022, బుధవారం

Ananda Bhairavi : Pilichina Muraliki Song Lyrics (పిలిచిన మురళికి )

చిత్రం: ఆనంద భైరవి (1983)

సాహిత్యం: వేటూరి

సంగీతం: రమేష్ నాయుడు

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి




పిలిచిన మురళికి వలచిన మువ్వకి యెదలో ఒకటె రాగం.. అది ఆనందభైరవి రాగం మురిసిన మురళికి మెరిసిన మువ్వకి యెదలో ప్రేమ పరాగం మది ఆనందభైరవి రాగం కులికేమువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచే  కులికేమువ్వల అలికిడి వింటే కళలే నిద్దురలేచే  మనసే మురళి ఆలాపనలో మధురానగరిగ తోచె  యమునా నదిలా పొంగినది స్వరమే వరమై సంగమమై మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమ పరాగం మది ఆనందభైరవి రాగం పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఏదలో ఒకటె రాగం.. అది ఆనందభైరవి రాగం ఎవరీ గోపిక పదలయ వింటే యెదలో అందియ మ్రోగే ఎవరీ గోపిక పదలయ వింటే యెదలో అందియ మ్రోగే పదమే పదమై మదిలో వుంటే ప్రణయాలాపన సాగే హౄదయం లయమై పోయినది లయమే ప్రియమై జీవితమై మురిసిన మురళికి మెరిసిన మువ్వకి ఎదలో ప్రేమ పరాగం మది ఆనందభైరవి రాగం పిలిచిన మురళికి వలచిన మువ్వకి ఏదలో ఒకటె రాగం.. అది ఆనందభైరవి రాగం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి