7, ఫిబ్రవరి 2022, సోమవారం

Athma Gouravam : Andenu Nede Andani Song Lyrics (అందెను నేడే )

చిత్రం: ఆత్మ గౌరవం (1965)

సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు

గానం: ఘంటసాల, పి. సుశీల


పల్లవి: 

అందెను నేడే అందని జాబిల్లి  నా అందాలన్నీ ఆతని వెన్నెలలే  అందెను నేడే అందని జాబిల్లి...  చరణం 1:  ఇన్నేళ్ళకు విరిసె వసంతములు  ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు  నిదురించిన ఆశలు చిగురించెలే  నిదురించిన ఆశలు చిగురించెలే...  చెలికాడే నాలో తలపులు రేపెనులే  అందెను నేడే అందని జాబిల్లి  నా అందాలన్నీ ఆతని వెన్నెలలే  చరణం 2:  నా చెక్కిలి మెల్లగ మీటగనే  నరనరముల వీణలు మ్రోగినవి  గిలిగింతల నా మేను పులకించెలే  గిలిగింతల నా మేను పులకించెలే..  నెలరాజే నాతో సరసములాడెనులే  అందెను నేడే అందని జాబిల్లి  నా అందాలన్నీ ఆతని వెన్నెలలే  చరణం 3:  ఇక రాలవు కన్నుల ముత్యములు  ఇక వాడవు తోటల కుసుమములు  వినువీధిని నామది విహరించెలే..  వినువీధిని నామది విహరించెలే..  వలరాజే నాలో వలపులు చిలికెనులే  అందెను నేడే అందని జాబిల్లి  నా అందాలన్నీ ఆతని వెన్నెలలే  అందెను నేడే అందని జాబిల్లి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి