7, ఫిబ్రవరి 2022, సోమవారం

Iddaru Mithrulu (1961) : Padavela Radhika Song Lyrics (పాడవేల రాధికా)

చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)

సాహిత్యం: శ్రీ శ్రీ

గానం: ఘంటసాల, పి. సుశీల

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు


పల్లవి :

ఆ... ఆ... ఆ... ఓ... ఓ... ఓ...
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక

చరణం : 1

ఈ వసంత యామినిలో... ఓ... ఈ వెన్నెల వెలుగులలో... ఓ... ఈ వసంత యామినిలో... ఓ... ఈ వెన్నెల వెలుగులలో... ఓ... జీవితమే పులకించగ... జీవితమే పులకించగ నీ వీణను సవరించి పాడవేల రాధికా...

చరణం : 2

గోపాలుడు నిను వలచి
నీ పాటను మది తలచి
ఈ వసంత యామినిలో... ఓ...
ఈ వెన్నెల వెలుగులలో... ఓ...
ఏ మూలనో పొంచి పొంచి...
ఏ మూలనో పొంచి పొంచి
వినుచున్నాడని యెంచి
పాడవేల రాధికా...

చరణం : 3

వేణుగానలోలుడు
నీ వీణామృదురవము వినీ
నీ వీణామృదురవము వినీ
ప్రియమారగ నినుచేరగ
దయచేసెడి శుభవే
వేణుగానలోలుడు

పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక

1 కామెంట్‌: