4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Athma Gouravam : Oka Poola Baanam Song Lyrics (ఒక పూలబాణం)

చిత్రం: ఆత్మ గౌరవం (1965)

సాహిత్యం: దాశరథి కృష్ణమాచార్య

సంగీతం: సాలూరి రాజేశ్వర రావు

గానం: ఘంటసాల, పి. సుశీల


పల్లవి:

ఒక పూలబాణం తగిలింది మదిలో తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే ఒక పూలబాణం తగిలింది మదిలో తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే చరణం 1:

అలనాటి కలలే ఫలియించే నేడే మనసైన వాడే మనసిచ్చినాడే అలనాటి కలలే ఫలియించే నేడే మనసైన వాడే మనసిచ్చినాడే ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి ఈ ప్రేమలో లోకమే పొంగిపోయి| వసంతాల అందాల ఆనందాల ఆడాలోయి ఒక పూలబాణం తగిలింది మదిలో తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే

చరణం 2: ఏ పూర్వబంధమో అనుబంధమాయే అపురూపమైన అనురాగమాయె ఏ పూర్వబంధమో అనుబంధమాయే అపురూపమైన అనురాగమాయె నీ కౌగిట హాయిగా సోలిపోయి నీ కౌగిట హాయిగా సోలిపోయి సరాగాల ఉయ్యాల ఉల్లాసంగా ఊగాలోయి ఒక పూలబాణం తగిలింది మదిలో తొలి ప్రేమదీపం వెలిగిందిలే నాలో వెలిగిందిలే వెలిగిందిలే నాలో వెలిగిందిలే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి