చిత్రం: డాక్టర్ చక్రవర్తి (1964)
సాహిత్యం: ఆచార్య ఆత్రేయ
గానం: పి. సుశీల
సంగీతం: సాలూరి.రాజేశ్వర రావు
నీవు లేక వీణా పలుకలేనన్నదీ నీవు రాక రాధా నిలువలేనన్నది ఆఆఆ.....ఆఆ....ఆఆ.. నీవు లేక వీణా... జాజి పూలు నీకై రోజు రోజు పూచె చూసి చూసి పాపం సొమ్మసిల్లి పోయె చందమామ నీకై తొంగి తొంగి చూసి …. 2 సరసను లేవని అలుకలుబోయె నీవు లేక వీణా... కలలనైన నిన్ను కనుల చూతమన్నా నిదుర రాని నాకు కలలు కూడ రావె కదలలేని కాలం విరహ గీతి రీతి …. 2 పరువము వృదగా బరువుగ సాగె నీవు లేక వీణా.. తలుపులన్ని నీకై తెరచి వుంచి నాను తలపులెన్నొ మదిలో దాచి వేచి నాను తాపమింక నేను ఓపలెను స్వామి …. 2 తరుణిని కరుణను యేలగ రావా నీవు లేక వీణా పలుకలేనన్నది నీవు రాక రాధా నిలువలేనన్నది నీవు లేక వీణా.....
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి