14, ఫిబ్రవరి 2022, సోమవారం

Antha Mana Manchike : Navvave Naa Chelli Song Lyrics (నవ్వవే నా చెలి.)

చిత్రం: అంతా మన మంచికే (1972)

సాహిత్యం: దాశరథి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,బి. వసంత

సంగీతం: సత్యం


పల్లవి: ఓహోహోహో.. ఓహో.. ఓహో.. ఆహా.. ఆహా.. ఆహా.. హేహేహే.. హేహేహే.. హేహేహే.. నవ్వవే నా చెలి.. నవ్వవే నా చెలి చల్లగాలి పిలిచేను.. మల్లెపూలు నవ్వేను వలపులు పోంగే వేళలో.. నవ్వనా నా ప్రియా.. మూడు ముళ్ళు పడగానే.. తోడు నీవు కాగానే మమతలు పండే వేళలో.. నవ్వనా నా ప్రియా చరణం 1: మనసులు ఏనాడో కలిశాయిలే మనువులు ఏనాడో కుదిరాయిలే నీవు నాదానవే.. నీవు నావాడవే నేను నీవాడనే.. నేను నీ దాననే ఇక నను చేరి మురిపింప బెదురేలనే.. నవ్వవే నా చెలి నవ్వనా నా ప్రియ.. చరణం 2: జగమేమి తలచేను.. మనకెందుకూ.. జనమేమి పలికేను.. మనకేమిటీ.. నేను నీవాడనే.. నేను నీదాననే నిజమైన మన ప్రేమ గెలిచేనులే నవ్వవే నా చెలి.. నవ్వనా నా ప్రియా.. చల్లగాలి పిలిచేను.. మల్లెపూలు నవ్వేను వలపులు పోంగే వేళలో.. నవ్వవే నా చెలి.. నవ్వనా నా ప్రియా.. ఏహేహే.. హేహే.. హోహోహో.. హోహోహో..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి