చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సాహిత్యం: దాశరథి
గానం: ఘంటసాల, పి. సుశీల
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
పల్లవి :
ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనులదానా ఓ... మేనాలోన ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీనా మేనాలోన ప్రియుని చేర వెళ్ళింది నా చెలి మీనా నింగి దాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోన ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారు గొలిపేవెందుకే నిషా కనులవాడా చరణం : 1
ఓ... ఓహో చెలియా నీవు కూడ ఓ పెళ్ళి పల్లకి చూసుకో ఓహో చెలియా నీవు కూడ ఓ పెళ్ళి పల్లకి చూసుకో హాయిగొలుపు సన్నాయి పాటలో వలపుబాటలే వేసుకో నే వెళితే మరి నీవు మజ్నూవవుతావూ... నే వెళితే మరి నీవు మజ్నూవవుతావూ... మజ్నూ నేనేతై ఓలైలా లోకమే చీకటైపోవునే మజ్నూ నేనేతై ఓలైలా లోకమే చీకటైపోవునే ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారుగా ఉందాములే నిషా కనులవాడా చరణం : 2
ఓ... ఆకాశంలో ఇంద్రధనసుపై ఆడుకొందుమా నేడే నీలినీలి మేఘాల రథముపై తేలిపోదుమీనాడే చంద్రుడు నేనై నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా నేను వీణనై నీవు నాదమై ఏకమవుదమా తీయగా ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ హుషారుగా ఉందాములే హమేషా మజాగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి