చిత్రం: జమీందార్ (1966)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, పి. సుశీల
సంగీతం: టీ. చలపతి రావు
ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను ఈ నవ్వులు ఎవ్వరివి నీవే చిలికించినవి ఈ నడకలు ఎవ్వరివి నీవే నడిపించినవి నీ జీవన రాగాలే నాలో వినిపించినవీ నీ జీవన రాగాలే నాలో వినిపించినవీ హో... నాలో వినిపించినవి ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను అల్లుకున్న ఆశలన్నీ పల్లవించె ఈనాడే మరులుగొన్న బాసలన్నీ పరిమళించె ఈ వేళా చేరలేని నీలాకాశం శిరసు వంచే మనకోసం చేరలేని నీలాకాశం శిరసు వంచె మనకోసం హో... శిరసు వంచె మన కోసం ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను ముందు నీవు నిలుచుంటే నందనాలు కావాలా మనసులోన నీవుంటే మందిరాలు నాకేలా కడలిలోని తరగలవోలే కలిసిపోదమీవేళా కడలిలోని తరగలవోలే కలిసిపోదమీవేళా హో... కలిసిపోదమీవేళ ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల కోసమే నేను కాచుకున్నాను
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి