27, ఫిబ్రవరి 2022, ఆదివారం

Maro Charithra : Padhahaarellaku Song Lyrics (పదహారేళ్ళకు నీలో నాలో)

చిత్రం. : మరో చరిత్ర (1976)

సంగీతం : ఎం.ఎస్.విశ్వనాథన్

గానం : ఎస్.జానకి

సాహిత్యం: ఆచార్య ఆత్రేయ



పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు

పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు వెన్నెలల్లె విరియబూచి వెల్లువల్లే ఉరకలేసే పదహారేళ్ళకు .... పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు పాటలు పాడిన చిరుగాలులకు తెరచాటొసగిన చెలులు శిలలకు(2) దీవెన జల్లులు చల్లిన అలలకు కోటి దండాలు శత కోటి దండాలు... నాతో కలిసి నడచిన కాళ్ళకు నాలో నిన్నే నింపిన కళ్ళకు నిన్నే పిలిచే నా పెదవులకు నీకై చిక్కిన నా నడుమునకు కోటి దండాలు శత కోటి దండాలు.. భ్రమలో లేపిన తొలి జాములకు సమయం కుదిరిన సందె వేళలకు నిన్ను నన్ను కన్నవాళ్ళకు(2) మనకై వేచే ముందు నాళ్ళకు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి