Ooriki Monagadu (1981) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Ooriki Monagadu (1981) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జనవరి 2025, శుక్రవారం

Ooriki Monagadu : Moggapindhe Song Lyrics (మొగ్గా పిందాల నాడే .)

చిత్రం: ఊరికి మొనగాడు (1981)

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం: చక్రవర్తి


పల్లవి:

మొగ్గా పిందాల నాడే ..బుగ్గా గిల్లేసినాడే...
హాయ్....మొగ్గా పిందాల నాడే ..హాయ్..బుగ్గా గిల్లేసినాడే...
కోనేటి గట్టుకాడ కొంగు పట్టి...ముద్దు పెట్టి..
చెంపలోని కెంపులన్నీ దోచినాడే...
హోయ్..మొగ్గా పిందాల నాడే ..బుగ్గా గిల్లేసినాదే...
అహ..మొగ్గా పిందాల నాడె ..హాయ్..బుగ్గా గిల్లేసినాదే...
గుండెల్లో వాలిపోయి గూడు కట్టి...జోడుకట్టి..
పాలుగారు అందమంత పంచినాదే...

చరణం 1:

అబ్బోసి వాడి వగలు..ఊ...లగ్గోసి పట్టపగలు..ఊ..
గుమ్మెక్కి గుబులుగుంటది...అబ్బ..దిమ్మెక్కి దిగులుగుంటది...
వల్లంకి పిట్టవంటు వళ్లంత నిమిరి నిమిరి వాటేస్తే...అంతేనమ్మో...
హాయ్ వయసొస్తే..ఇంతేనమ్మో...
అయ్యారే..తేనే చిలుకు..హోయ్..వయ్యారి జాణ కులుకు..
ఎన్నెల్లో పగలుగుంటది...అబ్బా..
మల్లెల్లో ....రగులుగుంటుంది...
వరసైనవాడవంటు సరసాలే చిలికి చిలికి
మాటిస్తే మనసేనమ్మో..హా మనసిస్తే మనువేనమ్మో...ఓ ఓ ...
మొగ్గా పిందాల నాడే ..హోయ్..బుగ్గా గిల్లేసినాడే...
హాయ్..హోయ్..హోయ్....మొగ్గా పిందాల నాడే ..
హోయ్..బుగ్గా గిల్లేసినాదే...

చరణం 2:

వాటారే పొద్దుకాడా..హోయ్..దాటాలా దాని గడప...
లేకుంటే తెల్లవారదు...హబ్బ..నా కంట నిద్దరుండదు
కొత్తిమేర చేనుకాడ పొలిమేర మరచిపోతే...
వాడంత గగ్గోలమ్మో....హోయ్...ఊరంతా అగ్గేనమ్మో..
తెల్లారే పొద్దుకాడా...హోయ్...పిల్లాడు ముద్దులాడి ..
పోకుంటే..సోకు నిలవదు..వాడు రాకుంటే వయసు బతకదు...
చెక్కిళ్ళ నునుపు మీద.. చెయ్యేస్తే ఎరుపు మిగిలి..
పక్కిళ్లు నవ్వేనమ్మో...ఈ నొక్కుళ్లు..ఏం చేసేనమ్మో...
హోయ్ మొగ్గా పిందాల నాడే ..అహ..బుగ్గా గిల్లేసినాదే...
లాలాలలా..ల..లా..ల...

Ooriki Monagadu : Andhaala Javvani Song Lyrics (అందాల జవ్వని.. మందార పువ్వని...)

చిత్రం: ఊరికి మొనగాడు (1981)

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం: చక్రవర్తి


పల్లవి :

అందాల జవ్వని.. మందార పువ్వని...
అందాల జవ్వని.. మందార పువ్వని...
నేనంటె నువ్వని.. నువ్వంటే నవ్వని
కలిసిందిలే కన్ను కలిసిందిలే..
తెలిసిందిలే మనసు తెలిసిందిలే

అందాల గువ్వని... రాగాల రవ్వని..
నేనంటే నువ్వని.. నువ్వంటే నవ్వని
కలిసిందిలే కన్ను కలిసిందిలే..
తెలిసిందిలే మనసు తెలిసిందిలే 

చరణం 1 :

గోదారి నవ్వింది.. పూదారి నవ్వింది
ఆ నవ్వు ఈ నవ్వు అందాలు రువ్వింది
చిలకమ్మ నవ్వింది.. గొరవంక నవ్వింది
ఆ నవ్వు ఈ నవ్వు నెలవంకలయ్యింది
వెలుగుల్లో నీ రూపు వెన్నెళ్లు కాచే వేళ
జిలుగైన సొగసంతా సిరిపైటలేసే వేళ
చినుకంటి నీ కన్ను చిటికేసి పోయే వేళ
తెలుగుల్లో నా వలపు తొలి పాట పాడింది
అందాల గువ్వని... రాగాల రవ్వని..

చరణం 2 :

వయసొచ్చి నవ్వింది.. మనసిచ్చి నవ్వింది
వలపల్లే వాలాడు పొద్దుల్లో నవ్వింది
పూరెమ్మ నవ్వింది.. పులకింతా నవ్వింది
నూగారు బుగ్గల్లో ముగ్గల్లే నవ్వింది
నీరాటి రేవుల్లో నీడల్లు ఆడే వేళ
నాలాటి ఊహల్లే మాటొచ్చి పాడె వేళ
బంగారు మలి సంధ్య రాగాలు తీసే వేళ
మబ్బుల్లో ఓ మెరుపు నను చూసి నవ్వింది
ఆ.. అహ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


Ooriki Monagadu : Erra Tholu Song Lyrics (ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి... )

చిత్రం: ఊరికి మొనగాడు (1981)

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

సంగీతం: చక్రవర్తి


పల్లవి :

ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
అల్లరింక ఆపకుంటే పిల్లి మెల్లో గంట కట్టి
అచ్చుపోసి పంపుతా తువ్వాయి

ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఈత పళ్లు రాలినట్టు మూతి పళ్లు రాలగొట్టి
మూటగట్టి పంపుతా లేవోయి..
ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి...
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి... 

చరణం 1 :

కోతి చేష్టలెక్కువైతే కోతి పిల్లవంటారు... తంతాను
పొగరుబోతు పనులు చేస్తే పోట్లగిత్తవంటారు... కొరుకుతా
ఒల్లు దగ్గరెట్టుకో... వన్నెలుంటే దిద్దుకో
ఒల్లు దగ్గరెట్టుకో... వన్నెలుంటే దిద్దుకో
అప్పుడే అందమైన ఆడపిల్లవంటారు 

కళ్లు నెత్తికెక్కితే ఒల్లు వాయగొడతారు... అబ్బా
ఒల్లు తిమ్మిరెక్కితే బడితె పూజ చేస్తారు... ఓయమ్మా
పిల్ల కాను చూసుకో... పిడుగు నేను కాసుకో...
పిల్ల కాను చూసుకో... పిడుగు నేను కాసుకో...
కాసుకో... చూసుకో... కాసుకో... చూసుకో...
ఓయె...యా.. ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి 


చరణం 2 : 

ఆ.. అహా.. హహా..హా.. ఆ.. ఆ.. ఆ.. హాహా... హా
రంకెలేస్తే గిచ్చకైనా మాట తప్పదు... గిల్లుతా..ఊ..
కంకె వేస్తే చేలుకైనా కోత తప్పదు... పొడుస్తా
ముల్లు బుద్ధి మానుకో... పువ్వు లాగ మారిపో..
ముల్లు బుద్ధి మానుకో... పువ్వు లాగ మారిపో..
ముద్దుగా మచ్చటైన ముద్దబంతివంటారు...

మాపతీపి రేగితే పంపరేసి పంపుతారు... ఓహొహో..
పిచ్చి నీకు రేగితే డొక్క నీకు చింపుతారు... హహహ
పిల్ల కాను చూసుకో... పిడుగు నేను కాసుకో...
పిల్ల కాను చూసుకో... పిడుగు నేను కాసుకో...
కాసుకో... చూసుకో... కాసుకో... చూసుకో...
హో... ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
అల్లరింక ఆపకుంటే పిల్లి మెల్లో గంట కట్టి
అచ్చుపోసి పంపుతా తువ్వాయి
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి...
అంత టెక్కు నీకు చిక్కు బుజ్జాయి
ఈతపళ్లు రాలినట్టు మూతి పళ్లు రాలగొట్టి
మూటగట్టి పంపుతా లేవోయి..
ఎర్ర తోలు బుర్రముక్కు అమ్మాయి...
ఎర్ర తోలు బుంగమూతి అబ్బాయి... 


9, జనవరి 2025, గురువారం

Ooriki Monagadu : Buzzam Banthi Song Lyrics (బూజం బంతి బూజం)

చిత్రం: ఊరికి మొనగాడు (1981)

సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి


పల్లవి :

బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో
బుజబుజరేకుల పిల్లా నవ్వు బంతీ పువ్వో
బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో
బుజబుజరేకుల పిల్లా నవ్వు బంతీ పువ్వో

కాదన్నట్టే ఉంటాదమ్మో  కన్నే పువ్వో...
నాదన్నట్టే ఉంటాదమ్మో  నవ్వో నవ్వో

బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో
బుజబుజరేకుల పిల్లాడంటే బంతీ పువ్వో
బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో
బుజబుజరేకుల పిల్లాడంటే బంతీ పువ్వో
ఔనన్నట్టే ఉంటాదమ్మో వాడి నవ్వో
నాదన్నట్టే ఉంటాదమ్మో నవ్వో పువ్వో
హోయ్... బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో
బుజబుజరేకుల పిల్లాడంటే బంతీ పువ్వో


చరణం 1 :

బుగ్గ మెరుపే మొగ్గ పడితే సందెలైపోయే
కురులు దువ్వి కొప్పు పెడితే రాతిరైపోయే
పూలు ముడిచి నవ్వగానే పున్నమైపోయే
పూలు ముడిచి నవ్వగానే పున్నమైపోయే
చిలిపివాడి వలపుబాట లిపికి దొరకని తీపి పాట
ఊరూ పాడే.. ఏరు పాడే
ఊరూ పాడే.. ఏరు పాడే.. ఒకటే పాట
పైరు పచ్చ ఈడుజోడు పాడే పాటా

అరెరే... బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో
బుజబుజరేకుల పిల్లా నవ్వు బంతీ పువ్వో
ఔనన్నట్టే ఉంటాదమ్మో వాడి నవ్వో
నాదన్నట్టే ఉంటాదమ్మో నవ్వో పువ్వో
హోయ్... బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో
బుజబుజరేకుల పిల్లాడంటే బంతీ పువ్వో


చరణం 2 :

హేయ్.. ఏటవాలు చూపు ఏదో మాటలాడింది
హోయ్.. ఎదల చాటు ఎదను దాటి మనసు లాగింది
చేరవస్తే జారు పైట పేరు నిలిపింది
చేరవస్తే జారు పైట పేరు నిలిపింది
పులకరించే వయసులోనా పలకరించే పడుచుగుండే
వాగువంకా.. హహహ
సాగే పాట.. హహహా
వాగువంకా సాగే పాట వలపే పాటా
పిల్లా పాప కలిగే దాకా పిలుపే పాటా

హోయ్... బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో
బుజబుజరేకుల పిల్లాడంటే బంతీ పువ్వో
కాదన్నట్టే ఉంటాదమ్మో  కన్నే పువ్వో...
నాదన్నట్టే ఉంటాదమ్మో  నవ్వో నవ్వో

హోయ్...  బూజం బంతి బూజం బంతి పువ్వో పువ్వో
బుజబుజరేకుల పిల్లా నవ్వు బంతీ పువ్వో 


1, ఫిబ్రవరి 2022, మంగళవారం

Ooriki Monagadu : Idigo Tella Cheera Song Lyrics (ఇదిగో తెల్ల చీరా)

చిత్రం: ఊరికి మొనగాడు (1981)

సాహిత్యం: ఆరుద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి. సుశీల

సంగీతం: చక్రవర్తి


పల్లవి : 

ఇదిగో తెల్ల చీరా ఇవిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లె పూలు తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పెట్టుకో తెల్లార్లు నా పేరు వల్లించుకో ఎందుకు.. ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి.. ఇదిగో తెల్ల చీరా ఇవిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లె పూలు తెల్ల చీర కట్టినా మల్లె పూలు పెట్టినా తెల్లార్లు నీ పేరు వల్లించుతా ఎందుకు.. ఇదే అసలు రాత్రి ఇదే అసలు రాత్రి

చరణం 1 : 

కాకి చేత పంపిస్తే కబురందిందా కళ్ళారా చూడగానే కథ తెలిసిందా ||2|| ఊరుకున్నా ఊసు పోనీ ఊవిళ్ళు ఓపలేని పిల్లకయ్యొ వేవిళ్ళూ ||2|| ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం ఆది లోనే బారసాల చేసుకోవా సీమంతం

ఇదిగో తెల్ల చీరా ఇవిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లె పూలు చరణం 2: 

సూది కోసం సోదికెలితే సుడి తిరిగిందా మోగమాటమ్ అనుకుంటే ముంచుకొచ్చిందా ||2|| కట్టవయ్యా నట్టింటా ఉయ్యాలా... గొడ్డైనా అయ్యో నువ్వే ఉపాలా.. ||2|| నేనే జోల పాడుతుంటే నువ్వు నిద్దర పోతావా అయ్యా మీరు పక్కనుంటే అసలే నిద్దర పడుతుందా.

ఇదిగో తెల్ల చీరా ఇవిగో మల్లె పూలు ఇదిగో తెల్ల చీర ఇవిగో మల్లె పూలు తెల్ల చీర కట్టుకో మల్లె పూలు పెట్టుకో తెల్లార్లు నా పేరు వల్లించుకో ఎందుకు.. ఇదే అసలు రాత్రి... ఇదే అసలు రాత్రి..