చిత్రం: పండంటి కాపురం (1972)
సాహిత్యం: మైలవరపు గోపి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
ఏమమ్మా జగడాల వదినమ్మో. ఎగిరెగిరి పడతావు ఏందమ్మో ఏమమ్మా జగడాల వదినమ్మో. ఎగిరెగిరి పడతావు ఏందమ్మో చిన్నారి పాపలూ అందాల బొమ్మలూ వాళ్ళంటే కోపమేల హోయ్ హోయ్ హోయ్య ఏమమ్మా జగడాల వదినమ్మో. ఎగిరెగిరి పడతావు ఏందమ్మో చిన్నవాళ్ళు కాకుండానే పెద్ద వాళ్ళు అవుతారా. అల్లరేమి చెయ్యకుండా నోరు మూసుకుంటారా చిన్నవాళ్ళు కాకుండానే పెద్ద వాళ్ళు అవుతారా. అల్లరేమి చెయ్యకుండా నోరు మూసుకుంటారా ఎవరినేమి అన్నారూ ఎవరిసొమ్ము తిన్నారూ చెయ్యి చేసుకుంటావా. ఆపవమ్మా నీ బుస బుసలూ... ఆ. ఆ. ఆ. ఏమమ్మా జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో చదువుంటే చాలదూ. సంస్కారం వుండాలీ మనుషుల్లో తిరిగేటప్పుడూ. మంచి మనసు కావాలీ చదువుంటే చాలదూ. సంస్కారం వుండాలీ మనుషుల్లో తిరిగేటప్పుడూ. మంచి మనసుకావాలీ గర్వాన్ని వదలాలీ.కలసిమెలిసి ఉండాలీ పుట్టింటికి మెట్టినింటికీ వన్నెవాసి తేవాలి ఓ. ఓ. ఓ. ఏమమ్మా జగడాల శోభమ్మో. ఎగిరెగిరి పడతావు ఏందమ్మో తల్లిని మరిపించే తల్లీ పినతల్లని అంటారే పిల్లలు ఏ తప్పు చెసినా సరిదిద్దాలంటారే తల్లిని మరిపించే తల్లీ పినతల్లని అంటారే పిల్లలు ఏ తప్పు చెసినా సరిదిద్దాలంటారే నీవే ఇట్లుంటేనూ లోకులు ఇది వింటేనూ అయ్యయ్యో ఉన్న గౌరవం గంగలోన కలిసేనూ ఊ.ఊ.ఏమమ్మా జగడాల వదినమ్మో. ఎగిరెగిరి పడతావు ఏందమ్మో ఏమమ్మా జగడాల శోభమ్మో. ఎగిరెగిరి పడతావు ఏందమ్మో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి