Pandanti Kapuram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Pandanti Kapuram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మార్చి 2022, శుక్రవారం

Pandanti Kapuram : Baabu Vinara Song Lyrics (బాబూ వినరా )

చిత్రం: పండంటి కాపురం (1972)

సంగీతం: స్.పి. కోదండపాణి రచన: దాశరథి కృష్ణమాచార్య గానం: ఘంటసాల బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని నలుగురు కలసి సాగించారు పండంటి కాపురం ఒక్క మాటపై ఎపుడు నిలిచారు వారు ఒక్క బాటపై కలసి నడిచారు వారు అన్నంటే తమ్ములకు అనురాగమే అన్నకు తమ్ములంటే అనుబంధమే చల్లని తల్లి ఆ ఇల్లాలు ఇంటికి వెలుగై నిలిచేను పిల్లలకు పెద్దలకు తల్లివంటిది ఆ ఇల్లు ఆమెతో స్వర్గమైనది అన్న మనసులో ఉన్నవి ఎన్నో కోరికలు తమ్ములకు జరగాలి పెళ్ళీపేరంటాలు పిల్లలతో ఆ ఇల్లు విలసిల్లాలి కలకాలం ఈలాగే కలసివుండాలి బాబూ వినరా అన్నాతమ్ముల కథ ఒకటి కలతలు లేని నలుగురు కలసి సాగించారు పండంటి కాపురం కన్నకలలు అన్ని కూడ కల్లలాయెనే అన్నదమ్ములొకటనుట అడియాశే ఆయెనే గూటిలోని ఆ గువ్వలు ఎగిరిపోయెనే స్వర్గమంటి ఇల్లంతా నరకంగా మారెనే ఆకలిని ఆవలిని కథగా మారే కలతే మిగిలే ఈనాడు ఏనాటికి ఏమౌనో ఎవరికి తెలుసు? విధి రాసిన రాతకు తిరుగే లేదు

6, ఫిబ్రవరి 2022, ఆదివారం

Pandanti Kapuram : Evamma Jagadala Song Lyrics (ఏమమ్మా జగడాల వదినమ్మో.)

చిత్రం: పండంటి కాపురం (1972)

సాహిత్యం: మైలవరపు గోపి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: స్.పి. కోదండపాణి



ఏమమ్మా జగడాల వదినమ్మో. ఎగిరెగిరి పడతావు ఏందమ్మో ఏమమ్మా జగడాల వదినమ్మో. ఎగిరెగిరి పడతావు ఏందమ్మో చిన్నారి పాపలూ అందాల బొమ్మలూ వాళ్ళంటే కోపమేల హోయ్ హోయ్ హోయ్య ఏమమ్మా జగడాల వదినమ్మో. ఎగిరెగిరి పడతావు ఏందమ్మో చిన్నవాళ్ళు కాకుండానే పెద్ద వాళ్ళు అవుతారా. అల్లరేమి చెయ్యకుండా నోరు మూసుకుంటారా చిన్నవాళ్ళు కాకుండానే పెద్ద వాళ్ళు అవుతారా. అల్లరేమి చెయ్యకుండా నోరు మూసుకుంటారా ఎవరినేమి అన్నారూ ఎవరిసొమ్ము తిన్నారూ చెయ్యి చేసుకుంటావా. ఆపవమ్మా నీ బుస బుసలూ... ఆ. ఆ. ఆ. ఏమమ్మా జగడాల వదినమ్మో ఎగిరెగిరి పడతావు ఏందమ్మో చదువుంటే చాలదూ. సంస్కారం వుండాలీ మనుషుల్లో తిరిగేటప్పుడూ. మంచి మనసు కావాలీ చదువుంటే చాలదూ. సంస్కారం వుండాలీ మనుషుల్లో తిరిగేటప్పుడూ. మంచి మనసుకావాలీ గర్వాన్ని వదలాలీ.కలసిమెలిసి ఉండాలీ పుట్టింటికి మెట్టినింటికీ వన్నెవాసి తేవాలి ఓ. ఓ. ఓ. ఏమమ్మా జగడాల శోభమ్మో. ఎగిరెగిరి పడతావు ఏందమ్మో తల్లిని మరిపించే తల్లీ పినతల్లని అంటారే పిల్లలు ఏ తప్పు చెసినా సరిదిద్దాలంటారే తల్లిని మరిపించే తల్లీ పినతల్లని అంటారే పిల్లలు ఏ తప్పు చెసినా సరిదిద్దాలంటారే నీవే ఇట్లుంటేనూ లోకులు ఇది వింటేనూ అయ్యయ్యో ఉన్న గౌరవం గంగలోన కలిసేనూ ఊ.ఊ.ఏమమ్మా జగడాల వదినమ్మో. ఎగిరెగిరి పడతావు ఏందమ్మో ఏమమ్మా జగడాల శోభమ్మో. ఎగిరెగిరి పడతావు ఏందమ్మో

5, ఫిబ్రవరి 2022, శనివారం

Pandanti Kapuram : Idigo devudu chesina bomma Song Lyrics(ఇదిగో దేవుడు )

చిత్రం: పండంటి కాపురం (1972)

సాహిత్యం: మైలవరపు గోపి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల

సంగీతం: స్.పి. కోదండపాణి




ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

ఇది నిలిచేదేమో… మూడు రోజులు

బంధాలేమో పదివేలు


ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

ఇది నిలిచేదేమో… మూడు రోజులు

బంధాలేమో పదివేలు

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ


నదిలో నావ… ఈ బ్రతుకు, ఊఉ ఆ ఆఆ

నదిలో నావ… ఈ బ్రతుకు

దైవం నడుపును… తన బతుకు

అనుబంధాలు ఆనందాలు… తప్పవులేరా కడవరకు

తప్పవులేరా కడవరకు


ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

ఇది నిలిచేదేమో… మూడు రోజులు

బంధాలేమో పదివేలు


రాగం ద్వేషం రంగులురా

రాగం ద్వేషం రంగులురా

భోగం భాగ్యం తళుకేరా

కునికే దీపం తొణికే ప్రాణం

నిలిచేకాలం తెలియదురా

నిలిచేకాలం తెలియదురా


ఇదిగో దేవుడు చేసిన బొమ్మ

ఇది నిలిచేదేమో… మూడు రోజులు

బంధాలేమో పదివేలు

ఇదిగో దేవుడు చేసిన బొమ్మ











4, ఫిబ్రవరి 2022, శుక్రవారం

Pandanti Kapuram : Eenaadu Kattukunna Song Lyrics (ఈనాడు కట్టుకున్న)

చిత్రం: పండంటి కాపురం (1972)

సాహిత్యం: మైలవరపు గోపి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల

సంగీతం: స్.పి. కోదండపాణి




ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు.ఊ. కావాలి ముందు ముందు పొదరిల్లు. పొదరిల్లు ఊ. ఊ. ఊ. ఓ. ఓహోహో. ఆహహా. ఈనాడు కట్టుకున్న. బొమ్మరిల్లు.ఊ. కావాలి ముందు ముందు పొదరిల్లు. పొదరిల్లు ఆశలే తీవెలుగా ఉహూ. ఊసులే పూవులుగా ఉహూ. వలపులే తావులుగా. అలరారు ఆ పొదరిల్లు ఆ.ఆ.ఆ. ఆశలే తీవెలుగా ఉహూ. ఊసులే పూవులుగా ఉహూ. వలపులే తావులుగా. అలరారు ఆ పొదరిల్లు పగలైనా రేయైనా. ఏ ఋతువులోనైనా పగలైనా రేయైనా. ఏ ఋతువులోనైనా కురిపించును తేనెజల్లు. పరువాల ఆ పొదరిల్లు ఈనాడు కట్టుకున్న. బొమ్మరిల్లు.ఊ. కావాలి ముందు ముందు పొదరిల్లు. పొదరిల్లు కళ్ళలో కళ్ళుంచీ ఉహూ. కాలమే కరిగించే ఉహూ. అనురాగం పండించే. ఆ బ్రతుకే హరివిల్లు ఆ.ఆ.ఆ. కళ్ళలో కళ్ళుంచీ ఉహూ. కాలమే కరిగించే ఉహూ. అనురాగం పండించే. ఆ బ్రతుకే హరివిల్లు నా దేవివి నీవైతే. నీ స్వామిని నేనైతే నా దేవివి నీవైతే. నీ స్వామిని నేనైతే పచ్చని మన కాపురమే. పరిమళాలు వెదజల్లు ఈనాడు కట్టుకున్న. బొమ్మరిల్లు.ఊ. కావాలి ముందు ముందు పొదరిల్లు. పొదరిల్లు ఊఁహూఁహూఁ. ఊఁహూఁహూఁ. ఊఁహూఁహూఁ. ఊఁహూఁహూఁ. ఊఁహూఁహూఁ. ఊఁహూఁహూఁ.