చిత్రం: సప్తపది (1981)
సాహిత్యం: వేటూరి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి
సంగీతం: కె వి మహదేవన్
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది !!
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
ఏడు వర్ణాలు కలిసీ ఇంద్రధనసౌతాది ఆన్ని వర్ణాలకు ఒకటే ఇహమూ పరముంటాది
ఏడు వర్ణాలు కలిసీ ఇంద్రధనసౌతాది
ఆన్ని వర్ణాలకు ఒకటే ఇహమూ పరముంటాది
ఆదినుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది
ఆదినుంచి ఆకాశం మూగది అనాదిగా తల్లి ధరణి మూగది నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు ఈ నడమంత్రపు మనుషులకే మాటలు ఇన్ని మాటలు
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది !!
ఏ కులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు యాదవుడు మా కులమే లెమ్మంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి