చిత్రం: తూర్పు పడమర (1976)
సాహిత్యం: సి. నారాయణ రెడ్డి
సంగీతం: రమేష్ నాయుడు
గానం: కోవెల సంత , పి. సుశీల
తూర్పు పడమర ఎదురెదురూ నింగీ నేలా ఎదురెదురూ కలియని దిక్కులు కలవవనీ తెలిసి ఆరాటం దేనికనీ ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేదీ? "2" చరణం: తూర్పున ఉదయించే సూర్యుడు పడమర నిదురించును పడమట నిదురించే సూర్యుడే తూర్పున ఉదయించును. ఆ తూర్పు పడమరకేమౌను? ఈ పడమర తూర్పుకేమౌను? ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేదీ? "తూర్పు" చరణం: నింగిని సాగే నీలిమేఘం నేల ఒడిలో వర్షించును నేలను కురిసే ఆ నీరే నింగిలో మేఘమై పయనించును. ఈ నింగికి నేల ఏమౌను? ఈ నేలకు నింగి ఏమౌను? ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేది? "తూర్పు" చరణం : వేయని నాటకరంగంపైప వ్రాయని నాటక మాడుతున్నాము సూత్రధారికి పాత్రధారులకు తేడా తెలియక తిరుగుతున్నాము. నాటకమే ఒక జీవితమా? జీవితమే ఒక నాటకమా? ఈ ప్రశ్నకు బదులేది? ఈ సృష్టికి మొదలేది? జీవితమే ఒక నాటకమయితే నాటకమే ఒక జీవితమయితే పాత్రలు ఎక్కడ తిరిగినా సూత్రధారి ఎటు తిప్పినా కథ ముగిసే లోగా కలవకుందురా ఆ సూత్రధారి తానే కలవకుండునా! విన్నవా! ఇది విన్నావా సూర్యుడా, ఉదయసూర్యుడా! పడమటి దిక్కున ఉదయించాలని భ్రాంతి ఎందుకో? సృష్టికి ప్రతిసృష్టి చేసే దీష్టి మానుకో నిన్ను ఆశగా చూసే కనులకు కన్నీరే మిగిలించకు - ఇంకా ఇంకా రగిలించకు చంద్రుని చలువను పంచుకో నిన్నటి ఆశలు తెంచుకో "తూర్పు" చరణం: కోటి వీణియలు గుండె అంచులను మీటి నావా దేవా? కొండవిడిచి ఆ కోన విడిచి కై దండ నొసగి కాపాడవా ఇక ఆడలేను ఈ నాటకం - అలసిపోయె నా జీవితం రావయ్యా! దిగిరావయ్యా ఇదే ఇదే నా మంగళగీతం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి