చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సాహిత్యం: ఆరుద్ర
గానం: ఘంటసాల, పి. సుశీల
సంగీతం: సాలూరి రాజేశ్వర రావు
పల్లవి:
హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి
ఒహో బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
ఆది నుంచి లోకంలో ఆడవారిది పైచేయి
ఒహో బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
ఆది నుంచి లోకంలో ఆడవారిది పైచేయి
చరణం 1:
నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరబాటు
నిజా నిజాలు తెలియకనే నిందవేసే పొరబాటు
నాటికి నేటికీ మీకు అలవాటే... హలో హలో ఓ అమ్మాయి ఔను మీదే పైచేయి
నాటికి నేటికీ మీకు అలవాటే... హలో హలో ఓ అమ్మాయి ఔను మీదే పైచేయి
చరణం 2:
బెట్టుచేసే మగవారి గుట్టు మాకూ తెలుసోయి
బెట్టుచేసే మగవారి గుట్టు మాకూ తెలుసోయి
మనసులో మమతలూ పైకి వేషాలూ... ఒహో బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
బెట్టుచేసే మగవారి గుట్టు మాకూ తెలుసోయి
మనసులో మమతలూ పైకి వేషాలూ... ఒహో బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
చరణం 3:
లడాయి చేసే స్త్రీజాతి రాకమానదు రాజీకి
లడాయి చేసే స్త్రీజాతి రాకమానదు రాజీకి
గెలుపు కోసం మగవారు గెలుపు కోసం పగవారు
కాళ్ళబేరాలాడకపోరు
ఒహో బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
ఆది నుంచి లోకంలో ఆడవారిది పైచేయి
లడాయి చేసే స్త్రీజాతి రాకమానదు రాజీకి
గెలుపు కోసం మగవారు గెలుపు కోసం పగవారు
కాళ్ళబేరాలాడకపోరు
ఒహో బడాయి చాలోయి కోతలెందుకు పోవోయి
ఆది నుంచి లోకంలో ఆడవారిది పైచేయి
హలో హలో ఓ అమ్మాయి పాతరోజులు మారాయి
ఆడపిల్ల అలిగినచో వేడుకొనడు అబ్బాయి
హలో హలో ఓ అమ్మాయి అందుకొనుమా నా గుడ్ బై
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి